Malaika Arora: మలైకా అరోరాకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..

Malaika Arora Injured In Car Accident: బాలీవుడ్‌ హీరోయిన్ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆమెను నేవీ ముంబైలోని అపోలో

Malaika Arora: మలైకా అరోరాకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..
Malaika Arora
Follow us

|

Updated on: Apr 03, 2022 | 12:07 AM

Malaika Arora Injured In Car Accident: బాలీవుడ్‌ హీరోయిన్ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆమెను నేవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స అందుతుందని వైద్యులు వెల్లడించారు. శనివారం పుణేలో ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. గాయడిన మలైకాను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మలైకా నుదిటిపై కంటి దగ్గర చిన్న గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆమెకు సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. రాత్రికి అబ్జర్వేషన్‌లో ఉంచుతామని.. రేపు ఉదయం డిశ్చార్జ్ అవుతారని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని మలైకా అరోరా సోదరి అమృతా అరోరా కూడా మీడియాకు వెల్లడించారు. ముంబయి-పుణే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మూడు కార్లు ఒక దానిని మరొకటి ఢీకొన్న ఘటనలో మలైకా గాయపడినట్లు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మలైకా తన డ్రైవర్, బాడిగార్డ్ తో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (MNS) కు చెందిన ఓ నాయకుడు ఆమెను తన కారులో ముంబైకి తీసుకెళ్లారని సిబ్బంది పేర్కొంటున్నారు.

Also Read:

Beast : బీస్ట్ ట్రైలర్ వచ్చేసింది.. టెర్రరిస్ట్‌ల అంతుచూసే సోల్జర్ విజయ్ రాఘవన్‌గా దళపతి

Ante Sundaraniki: ముహూర్తం ఖరారు.. ‘అంటే సుందరానికి..’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..