AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: అది గొప్ప పుస్తకం.. వీలుంటే అందరూ ఒక్కసారైనా చదవండి.. త్రివిక్రమ్ కామెంట్స్..

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇటీవలే ఆదర్శ కుటుంబం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. త్రివిక్రమ్ మాటలకు, డైలాగ్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే గతంలో ఓ వేడుకలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Trivikram Srinivas: అది గొప్ప పుస్తకం.. వీలుంటే అందరూ ఒక్కసారైనా చదవండి.. త్రివిక్రమ్ కామెంట్స్..
Trivikram
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2026 | 8:12 AM

Share

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, “మాంత్రికుడు” త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే కాకుండా ఆయన చెప్పే మాటలు, ఇచ్చే స్పీచ్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుంటాయి. గతంలో ఓ సినిమా వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. మానవ సంబంధాలు, మన దైనందిన జీవితంలో మనం కోల్పోతున్న చిన్న చిన్న సంతోషాలు, ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన గొప్ప వరాల గురించి ఆయన ఎంతో అద్భుతంగా వివరించారు. ప్రస్తుత ఆధునిక జీవితం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. “మనం ఇప్పుడు ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం. ఫోన్ చూస్తూ హలో చెబుతున్నాం, టీవీ చూస్తూ భోం చేస్తున్నాం. పక్క పక్కన కూర్చుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని మాట్లాడుకోవడం మానేశాము” అంటూ మనుషుల మధ్య పెరుగుతున్న దూరాన్ని ఆయన ఆవేదనతో పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

ప్రకృతి మనకు ఇచ్చిన అత్యంత విలువైన వస్తువులను మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో వివరిస్తూ త్రివిక్రమ్ చెప్పిన ఉదాహరణలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. గాలి, నీరు: ప్రపంచంలో గాలి, నీరు, అమ్మ, నాన్న వంటి గొప్ప విషయాలను దేవుడు మనకు పూర్తిగా ఉచితంగా ఇచ్చాడు. కానీ మనం ఫ్రీగా దొరికే స్వచ్ఛమైన గాలిని పీల్చకుండా, డబ్బులు పెట్టి సిగరెట్లు కొని అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం. ఉచితంగా దొరికే మంచి నీరు తాగకుండా, మందులని, కూల్ డ్రింక్స్ వైపు వెళ్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

గుంటూరుకు చెందిన ప్రముఖ రచయిత శంకరంబాడి సత్యనారాయణ గారు రాసిన ‘అమరావతి కథలు’ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ.. ఉదయాన్నే లేవడం, నదికి వెళ్లడం, దేవుడికి దండం పెట్టుకోవడం, సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం లాంటి సాధారణ జీవితాన్ని గడపడమే నిజమైన గొప్పతనమని తెలిపారు. ఏ తప్పు చేయకుండా, ఇతరులకు కీడు తలపెట్టకుండా సాధారణంగా బతికి చచ్చిపోయిన వాళ్లే నిజమైన మహానుభావులని ఆయన అన్నారు. బూతులు లేని, ఎవరి లోపాలను ఎత్తిచూపకుండా కేవలం మన మధ్య ఉండే మాటలతోనే నవ్వించే ప్రయత్నం చేయడమే తన ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us