Vantalakka Education: తెలుగింటి ఆడబడుచులా ఆదరణ సొంతం చేసుకున్న కేరళ కుట్టి వంటలక్క ఏమి చదువుకుందో తెలుసా..!

కార్తీక దీపం సీరియల్ తెలుగు లోగిల్లో ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఈ సీరియల్ వచ్చే సమయానికి చిన్న,పెద్ద, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా టీవీలను అతుక్కుపోతున్నారు.. అందుకనే ...

Vantalakka Education: తెలుగింటి ఆడబడుచులా ఆదరణ సొంతం చేసుకున్న కేరళ కుట్టి వంటలక్క ఏమి చదువుకుందో తెలుసా..!
Karthika deepam fame premi viswanath
Follow us

|

Updated on: Feb 22, 2021 | 4:07 PM

Vantalakka Education: కార్తీక దీపం సీరియల్ తెలుగు లోగిల్లో ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఈ సీరియల్ వచ్చే సమయానికి చిన్న,పెద్ద, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా టీవీలను అతుక్కుపోతున్నారు.. అందుకనే మూడేళ్లు దాటినా ఈ సీరియల్ ఇప్పటికీ టాప్ రెంటింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ లో దీప పాత్ర నల్లఅక్క, వంటలక్క గా ఫేమస్ అయింది. అయితే వంటలక్క గా నటిస్తున్న ప్రేమి విశ్వనాధ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..!

వంటలక్క పాత్రతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని తెలుగింటి ఆడబడుచుగా మారింది. ప్రేమి విశ్వనాథ్. నిజానికి దీప కేరళ కుట్టి. ప్రేమి విశ్వనాథ్ డిసెంబర్ 2న 1991 లో కేరళలో జన్మించింది. తల్లిదండ్రులు విశ్వనాథ్, కాంచనలు. ప్రేమి కి ఒక అన్న కూడా ఉన్నాడు. ఆటను శివ ప్రసాద్. మంచి ఫోటో గ్రాఫర్. ఎర్నాకుళంలో రెండు స్టూడియో లు కూడా ఉన్నాయి. ఇక ప్రేమి విశ్వనాధ్ కు అన్నలా ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇషమట.

లా చదివిన ప్రేమి నటిగా మారక ముందు ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేసేది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది. ఇక మోడలింగ్ లో ప్రేమి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అనంతరం 2013 లో ఓ ప్రముఖఛానల్ రూపొందించిన కరతముత్తు సీరియల్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ 2013 లో కేరళలో ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది .ఆ ధారావాహిక మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించి, ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది. ఈ సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ నటించినందుకు ఆమెకు ఉత్తమ మహిళా నటి (2014) ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది.

ఇక తెలుగులో రీమేక్ కార్తీక దీపం పేరుతో రీమేక్ చేశారు. ఈ ధారావాహిక 2017, అక్టోబరు 16వ తేదీ నుంచి స్టార్ మాలో ప్రసారం  అవుతుంది. తెలుగులో కూడా వంటలక్కగా ఈ సీరియల్ టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. దీప తర్వాత మరో రెండు సీరియల్స్ లో, రెండు తమిళ చిత్రాల్లో నటించింది. ఓ ఫేమస్ జోతిష్యుడైన డా. టి.ఎస్‌. వినీత్‌ భట్‌ తో ప్రేమి వివాహం చేసుకుంది ప్రేమి విశ్వనాధ్.

Also Read:

 అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే టమాటా.. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..!

ప్రపంచంలో 256 ఏళ్ళు బతికిన వృద్ధుడు.. జీవిత రహస్యం ఏమిటంటే.. !

Latest Articles