AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : పేరుకే సీరియల్ బ్యూటీ.. కానీ రెండు స్టూడియోలకు ఓనర్.. తెలుగులో యమ క్రేజ్ బాబోయ్..

తెలుగు బుల్లితెర ప్రపంచంలో సీరియల్ తారలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇతర భాషలకు చెందిన నటీనటులు ఇప్పుడు టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. అయితే ఓ నటి మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికీ ఆమె నటిస్తున్న ఓ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఆమెకు సొంతంగా రెండు స్టూడియోలు సైతం ఉన్నాయట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Serial Actress : పేరుకే సీరియల్ బ్యూటీ.. కానీ రెండు స్టూడియోలకు ఓనర్.. తెలుగులో యమ క్రేజ్ బాబోయ్..
Premivishwanth
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2026 | 8:09 PM

Share

తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఒక ప్రభంజనంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సంవత్సరాలకు సంవత్సరాలుగా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఈ సీరియల్, రికార్డు స్థాయి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ సీరియల్‌కు జీవనాడిగా నిలిచిన దీప పాత్రధారి ప్రేమి విశ్వనాథ్, తన అసాధారణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి తెలుగువారిని అలరిస్తుంది ప్రేమి విశ్వనాథ్. అయితే, తెరపై కనిపించే దీప పాత్రకు, నిజ జీవితంలోని ప్రేమి విశ్వనాథ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆమె ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే యాంకర్ సుమ, ప్రేమి విశ్వనాథ్ ఎందుకు ఇన్నాళ్లూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని ప్రశ్నించగా, “ఇంత మంచి ఫ్లోర్, ఇంత మంచి యాంకర్ దొరకలేదు” అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడుతూ, తాను ఎక్కువగా బయటకి వెళ్లలేదని, షోలకు మాత్రమే పరిమితం అయ్యానని చెప్పారు. ఇప్పుడిప్పుడే బయటకి వెళ్లడం మొదలుపెట్టానని, ప్రజలు తనను దీపగానే గుర్తిస్తున్నారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

ప్రేమి విశ్వనాథ్ దీప పాత్రకు ఎంతగా ప్రాణం పోశారంటే, ఆమె అసలు పేరు ప్రేమి అని చాలా మంది మరిచిపోయారు. లొకేషన్‌లోనూ, బయట కూడా తనను అందరూ దీప అనే పిలుస్తున్నారని, చివరకు యాంకర్ సుమ కూడా మొదట తనను దీప అనే పలిచారని ఆమె పంచుకున్నారు. తన మలయాళ సీరియల్ కరుత్తముత్తులో కూడా తన పాత్ర పేరు కార్తీక అని, అక్కడ కూడా తనను కార్తీక అనే పిలుస్తారని తెలిపారు. మూడు వేర్వేరు పేర్లతో పిలవబడుతుండటం ఒక ఆసక్తికరమైన అనుభవం అని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ప్రేమి విశ్వనాథ్ కెరీర్ మోడలింగ్‌తో ప్రారంభమైంది. తాను నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పటికీ తనకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదని ఆమె వినయంగా చెప్పారు. కేరళలో తనకు రెండు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు ఉన్నాయని, షూటింగ్ లేని సమయంలో వాటి పని చూసుకోవడానికి కేరళకు వెళ్తుంటానని, అందుకే ఇక్కడ ఖాళీగా కూర్చోవడానికి సమయం ఉండదని తెలిపారు. మూడు సంవత్సరాలుగా షూటింగ్, స్టూడియో పనులతో బిజీగా గడిపానని, ఇప్పుడు మెల్లమెల్లగా బయటకి వెళ్తున్నానని చెప్పారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. “ఖాళీగా కూర్చోకుండా మనం ఒక సిగ్నేచర్ పెట్టి వెళ్లాలి” అనేదే తన ఆశయం అని ఆమె పంచుకున్నారు. తనకు సొంతంగా రెండు స్టూడియోలు ఉన్నట్లు తెలిపారు. తన భర్త అస్ట్రాలజర్ అని.. ఎప్పుడూ బిజీగా ఉంటారని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ప్రేమి విశ్వనాథ్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us