Avatar 2: క్రేజీ అప్డేట్.. ఏకంగా 160 భాషల్లో విడుదలకు సిద్ధమైన అవతార్ 2.. ఎప్పుడంటే..

|

Apr 27, 2022 | 10:58 AM

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం అవతార్ (Avatar 2). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా

Avatar 2: క్రేజీ అప్డేట్.. ఏకంగా 160 భాషల్లో విడుదలకు సిద్ధమైన అవతార్ 2.. ఎప్పుడంటే..
Avatar 2
Follow us on

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం అవతార్ (Avatar 2). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 25 బిలియన్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించాడు డైరెక్టర్ జేమ్స్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అవతార్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవతార్ 2 సినిమాను 2020లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆలస్యం కావడంతో అవతార్ 2 సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్.

తాజాగా అవతార్ 2 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏకంగా 160 భాషలలో విడుదల చేయబోతున్నారట. ఇక అదే జరిగితే సినీ చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్ ఇదే.. ఈ సినిమా గ్లింప్స్ ను సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట.. అలాగే హాలీవుడ్ మూవీ డైరెక్టర్ స్ట్రేంజ్ మ్యా్డ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..