సూపర్‌స్టార్‌పై పంచ్.. హ్యాష్‌టాగ్ బాయ్‌కాట్ కోమలి ట్రెండింగ్!

ఈ మధ్య విడుదలైన సినిమాలు లేదా ట్రైలర్లు ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బ తీస్తున్నట్లు ఉన్నాయి. ఏదైనా సినిమా లేదా దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎవరైనా మనోభావాలు హార్ట్ అయితే చాలు.. సోషల్ మీడియా వేదికగా హంగామా మొదలు పెడుతున్నారు. సరిగ్గా అదే కోవలో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ జాయిన్ అయ్యారు. దానికి కారణం జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోమలి’. టైటిల్ చూసి […]

సూపర్‌స్టార్‌పై పంచ్.. హ్యాష్‌టాగ్ బాయ్‌కాట్ కోమలి ట్రెండింగ్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 06, 2019 | 7:16 AM

ఈ మధ్య విడుదలైన సినిమాలు లేదా ట్రైలర్లు ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బ తీస్తున్నట్లు ఉన్నాయి. ఏదైనా సినిమా లేదా దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎవరైనా మనోభావాలు హార్ట్ అయితే చాలు.. సోషల్ మీడియా వేదికగా హంగామా మొదలు పెడుతున్నారు. సరిగ్గా అదే కోవలో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ జాయిన్ అయ్యారు. దానికి కారణం జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోమలి’.

టైటిల్ చూసి కొత్తగా ఉందనుకున్నారా.. నిజమే ‘కోమలి’ అనేది పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. ఈ మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. థీమ్ ఇంటరెస్టింగ్‌గా ఉండడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఈ ట్రైలర్‌లో ఒక డైలాగ్‌పై మాత్రం రజనీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమాలో హీరో జయం రవి టీనేజ్ వయసులో ఒక ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్తాడు. సరిగ్గా పదహారేళ్ళ తర్వాత  కోమా నుంచి బయటికి వస్తాడు. అతని ఫ్రెండ్ యోగిబాబు  ‘ నువ్వు పదహారేళ్ళు కోమాలో ఉన్నావ్ రా’ అని అంటాడు. ఇది విన్న జయం రవి అసలు ఆ విషయాన్ని నమ్మడు. అప్పుడు యోగిబాబు సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ వీడియో చూపిస్తూ ‘చూడు..  ఇది 2016’ అంటాడు.  అయితే జయం రవి “నేను నమ్మను.. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాను అంటున్నాడంటే ఇది 1996”  అంటాడు. ఇక ఈ డైలాగు అభిమానులను బాగా కనెక్ట్ అయింది.

మరోవైపు రజనీ ఫ్యాన్స్ మాత్రం దీనిపై ఫైర్ అవుతున్నారు. ‘#బాయ్ కాట్ కోమాలి’ నేమ్‌తో ట్విట్టర్‌లో ఒక హ్యాష్ టాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అటు చిత్ర యూనిట్ వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. అభిమానులు ఆ సీన్‌ను డిలీట్ చేయాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో.

Latest Articles
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే

దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ

కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్

వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది

ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..