Tollywood : ఏందీ అమ్మడు ఇది నువ్వేనా.. గ్లామర్ క్వీన్‏గా ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..

మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అంతారా మాలి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, 2009లో పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని గడుపుతున్న ఆమె సినీ ప్రయాణం, ఆమె ప్రస్తుత విశేషాలు మీకోసం.

Tollywood : ఏందీ అమ్మడు ఇది నువ్వేనా.. గ్లామర్ క్వీన్‏గా ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
Anthara Mali

Updated on: Oct 09, 2026 | 7:49 AM

సినిమా గ్లామర్ ప్రపంచంలో మెరిసి మాయమయ్యే తారలు ఎంతోమంది ఉంటారు. అప్పట్లో తన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ అంతారా మాలి. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ జగదీష్ మాలి కుమార్తె అయిన ఈ భామ, మాధురీ దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్ కావాలనే కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1998లో ‘ధుంధతే రహ జావోగే’ అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అంతారా మాలి, 1999లో వచ్చిన ‘ప్రేమకథ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సుమంత్ హీరోగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా ఇదే అయినప్పటికీ, ప్రేక్షకజనంలో చెరగని ముద్ర వేసింది.

ఆ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ‘కంపెనీ’, ‘రోడ్’, ‘దర్నా మనా హై’, ‘మై మాధురీ దీక్షిత్ బన్నా చాహతీ హూన్’ వంటి చిత్రాలు ఆమెకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అప్పట్లో ప్రముఖ నటి ఊర్మిళ మటోండ్కర్‌కు సైతం గట్టి పోటీ ఇచ్చింది. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. 2010లో వచ్చిన ‘అండ్ వన్స్ ఎగైన్’ చిత్రంలో అంతారా మాలి ఒక సన్యాసిని పాత్రలో కనిపించింది. ఆ పాత్ర కోసం ఏకంగా గుండు కొట్టించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. నటనపై ఆమెకున్న అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 2009లో ‘జీక్యూ ఇండియా’ ఎడిటర్ చే కుర్రియన్‌ను అంతారా వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే పరిమితమై, గ్లామర్ రంగానికి శాశ్వతంగా దూరమైంది. దాదాపు 15 ఏళ్లకు పైగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతోంది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణిగా ఏలిన అంతారా మాలి ల్యాండ్‌మార్క్ సినిమాలు ఇప్పటికీ సినిమా ప్రియుల మనస్సుల్లో నిలిచే ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

Prema Katha

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

Loading...
Unable to load recommendations.
Follow Us