
భారతీయ చలనచిత్ర రంగంలో దశాబ్దాలుగా విలక్షణమైన నటనతో అలరించిన లెజెండరీ నటుడు నానా పటేకర్ మృతితో యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ వేదికగా నానా పటేకర్ కు సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతేకాకుండా గతంలో నానా పటేకర్ ఓ ఇంటర్వ్యూలో తన చావు, జీవితంపై మాట్లాడిన ఒక భావోద్వేగ పాత వీడియోను వర్మ షేర్ చేయడంతో అది ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. అందులో నానా మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. “మనం ఒకరోజు ఖచ్చితంగా పోతామనేది పచ్చి నిజం. దానికి నాతో వచ్చే ఆఖరి ఆస్తి కేవలం 12 మణుల కట్టెలు మాత్రమే. ఆ కట్టెలను నేను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాను. అవే నా ఆఖరి ఆస్తి. అంతకుమించి నేనేమీ తీసుకెళ్లను” అని నవ్వుతూ చెప్పారు.
అంతేకాకుండా, తన దహనసంస్కారాల సమయంలో పచ్చి కట్టెలు అస్సలు ఉపయోగించవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. “నా అంత్యక్రియలకు ఎండబెట్టిన కట్టెలనే వాడాలని చెప్పాను. పచ్చి కట్టెలు వాడితే బాగా పొగ వస్తుంది. ఆ పొగ వల్ల అక్కడ ఉన్న నా స్నేహితులు, బంధువుల కళ్లల్లో నీళ్లు వస్తాయి. నేను చనిపోయిన వేళ.. వాళ్లు నా కోసమే ఏడుస్తున్నారనే ఒక పెద్ద అపోహ నాకు కలగకూడదు. అందుకే ఎండుకట్టెలనే కాల్చాలి” అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మనిషి చనిపోయిన కొన్ని రోజులకే ప్రపంచం మరచిపోతుందని, ఆడంబరాలకు, కృత్రిమత్వానికి తాను దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోయాక గోడలపై తన ఫోటోలు పెట్టి పూజించవద్దని కుటుంబ సభ్యులకు కూడా ముందే చెప్పినట్లు ఆ వీడియోలో నానా పటేకర్ వెల్లడించారు.
నానా పటేకర్ 1951 జనవరి 1న జన్మించారు. ఆయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయన ఒక మరాఠీ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి గజానన్ (దింకర్) పటేకర్ ఒక వస్త్ర చిత్రకారుడు , వ్యాపారవేత్త. నానా పటేకర్‌కు 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన మరణించారు. ఆయన తల్లి నిర్మలా పటేకర్ (సంజనబాయి పటేకర్) ఒక గృహిణి. ఆమె తన మరణం వరకు ఆ ప్రముఖ నటుడితోనే జీవించారు. ఆయన భార్య నీలకంఠి పటేకర్ ఒక బ్యాంకు అధికారిణి, నటి , రంగస్థల నిపుణురాలు. వీరిద్దరూ 1978లో వివాహం చేసుకుని, ఆ తర్వాత విడివిడిగా జీవించారు, కానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు.
https://t.co/GLqT6VXcD5
— Ram Gopal Varma (@RGVzoomin) October 8, 2026
ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..