Viral Photo: రాముడు మంచి బాలుడు అన్నట్లున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇతను ఓ సంచలనం..

Viral Photo: చిన్ననాటి ఫోటోలు (Childhood Photos) పెద్దాయ్యక తిరిగి చూసుకోవడం ఓ మధురానుభూతి. ఒక్కసారి పాత ఆల్బమ్స్‌ను ముందేసుకుంటే కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలు కదలాడుతుంటాయి, గతంలోకి తీసుకెళుతుంటాయి. ఒకప్పుడు ఈ జ్ఞాపకాలను చూసుకొని తమకు తామే సంతోషించే..

Viral Photo: రాముడు మంచి బాలుడు అన్నట్లున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇతను ఓ సంచలనం..
Viral Photo

Updated on: Mar 12, 2022 | 9:57 AM

Viral Photo: చిన్ననాటి ఫోటోలు (Childhood Photos) పెద్దాయ్యక తిరిగి చూసుకోవడం ఓ మధురానుభూతి. ఒక్కసారి పాత ఆల్బమ్స్‌ను ముందేసుకుంటే కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలు కదలాడుతుంటాయి, గతంలోకి తీసుకెళుతుంటాయి. ఒకప్పుడు ఈ జ్ఞాపకాలను చూసుకొని తమకు తామే సంతోషించే వారు కానీ, సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత నలుగురితో పంచుకుంటూ సంబురపడుతున్నారు. దీనికి సెలబ్రిటీలు సైతం అతీథులేం కాదు. తమ చిన్ననాటి ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇక మరికొందరి సెలబ్రిటీల ఫోటోలను తమ అభిమానులు షేర్‌ చేస్తూ ఎవరో గుర్తు పట్టండి అంటూ ఛాలెంజ్‌లు విసురుతున్నారు.

 

తాజాగా ఇలాంటి ఓ సెలబ్రిటీ ఫోటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. పైన కనిపిస్తున్న కుర్రాడి ఫోటోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా.? జుట్టును నీట్‌గా కోంబ్‌ చేసుకొని, రాముడి మంచి బాలుడు అన్నట్లు కనిపిస్తున్నాడు కదూ.! కానీ ఈ కుర్రాడు అలాంటిలాంటి వ్యక్తి కాదు. తనను తాను మంచి వాడు కాదని ఎలాంటి సంశయం లేకుండా చెప్పుకుంటాడు. తనకు నచ్చిందే చేస్తా.. నచ్చనిది చేయను అని చెబుతాడు. మనిషికి సంతోషాన్ని మించి మరేది ముఖ్యం కాదని వేదాంతం చెబుతాడు. ఇష్టం వచ్చినట్లు బతుకుతాడు.. అదేంటి అని అడిగితే నా ఇష్టం అంటాడు.

ఇదంతా చదువుతుంటే ఈ కుర్రాడు ఎవరో మీకు ఇప్పటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ.! అవును మీరు అనుకుంటుంది నిజమే. ఈ ఫోటోలో ఉంది మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. శివ సినిమాతో ఓ పెను సంచలనంలా దూసుకొచ్చిన వర్మ. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో భూకంపం సృష్టించారు. ఇక జయాపజయాలకు అతీతంగా సినిమాలు తీసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇండియన్‌ సినిమా స్టైల్‌ను మార్చేసిన వర్మ, నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తూనే ఉంటారు. ఏ కాంట్రవర్సీ లేకపోతే ట్విట్టర్‌ తీసుకొని తానే ఓ కాంట్రవర్సీని రాజేస్తుంటారు. ఏది ఏమైనా తనకు నచ్చిందే చేస్తానంటూ, నా చావు నేను చస్తా అని చెబుతుంటారు వర్మ.

Also Read: Viral Video: వేగంగా వెళ్తున్న ట్రక్.. స్టీరింగ్‌ వదిలేసి డ్రైవర్‌ డాన్స్‌లు.. అంతలో ఊహించని షాక్‌..(వీడియో)

Kamal Haasan: యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్న కమల్.. విక్రమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేది అప్పుడే..

Aadi Saikumar: కొత్త సినిమా మొదలుపెట్టిన కుర్ర హీరో.. హీరోయిన్ ఎవరంటే..