Sonakshi Sinha: పెళ్లైన ఐదు రోజులకే ఆసుపత్రిలో చేరిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ అంటూ రూమర్స్.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ధబాంగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సోనాక్షి సిన్హా. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనాక్షి.. ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామండి వెబ్ సిరీస్ లో నటించింది. అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ఇటీవల ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

Sonakshi Sinha: పెళ్లైన ఐదు రోజులకే ఆసుపత్రిలో చేరిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ అంటూ రూమర్స్.. అసలేం జరిగిందంటే..
Sonakshi Sinha
Follow us

|

Updated on: Jun 29, 2024 | 9:35 AM

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ధబాంగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సోనాక్షి సిన్హా. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనాక్షి.. ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామండి వెబ్ సిరీస్ లో నటించింది. అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ఇటీవల ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు జహీర్ ఇక్బాల్‏తో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి.. జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సోనాక్షి ఇద్దరు సోదరులు దూరంగా ఉండడం.. అంతకు ముందు ఆమె తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. సోనాక్షి వివాహం ఆమె ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే తన కూతురు వివాహం గురించి వచ్చిన వార్తలను ఖండించారు నటుడు శత్రుఘ్ను సిన్హా. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోనాక్షికి సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

జూన్ 23న ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి.. ఇప్పుడు ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. పెళ్లైన ఐదు రోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి తన భర్త జహీర్ తో కలిసి బయటకు వస్తూ కనిపించింది సోనాక్షి. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ అంటూ నెట్టింట రూమర్స్ వైరలయ్యాయి. సోనాక్షి ప్రెగెన్సీ రూమర్స్ కు అలియా భట్ ను లింక్ చేస్తున్నారు. గతంలో పెళ్లైన కొద్ది రోజులకే అలియా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు సోనాక్షి విషయంలోనూ అలాగే జరుగుతుందంటూ పోస్టులు పెడుతున్నారు.

అయితే సోనాక్షి, ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్లడానికి కారణం ఆమె తండ్రి శత్రఘ్ను సిన్హా అని సన్నిహితులు చెబుతున్నారు. తన తండ్రి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే సోనాక్షి ఆసుపత్రికి వెళ్లిందంటూ క్లారిటీ ఇస్తున్నారు. తండ్రిని కలిసేందుకే సోనాక్షి ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తన కూతురి పెళ్లి గురించి శత్రఘ్ను సిన్హా స్పందిస్తూ.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స