ప్రస్తుతం బాలీవుడ్ లోని సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అంతేకాదు దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతను వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. కొన్ని నివేదికల ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ డాలర్లు. అంటే ఆయన ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు. షారూఖ్ ఖాన్ తర్వాత, బాలీవుడ్ నటి జూహీ చావ్లా భారతదేశంలోని అత్యంత సంపన్న కళాకారుల జాబితాలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ సుమారు 4,600 కోట్ల రూపాయలు. షారుక్ ఖాన్ 2023లో వరుస విజయాలు అందుకున్నాడు. ఒక్కో సినిమా నుంచి 150 నుంచి 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. గతేడాది ఆయన నటించిన ‘జవాన్’, ‘పఠాన్’, ‘డంకీ’ చిత్రాలు విజయం సాధించాయి. దీంతో కింగ్ ఖాన్ సంపద మరింత పెరిగింది.
షారూఖ్ ఖాన్ సినిమాల్లో నటించడంతో పాటు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇది కూడా ఆయన సంపదను పెంచడానికి ఆదాయ వనరు కూడా. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో షారుక్ ఖాన్ చాలా సినిమాలను నిర్మించారు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను షారూఖ్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. ఇది జూహీ చావ్లా సహ యజమాని. ఈ టీమ్ విలువ వందల కోట్లు. ఇక ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు షారూఖ్ ఖాన్ 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.
షారుఖ్ ఖాన్‌కు ‘మన్నత్’ అనే పేరు మీద ఓ లగ్జరీ ఇల్లు ఉంది. దీని ఖరీదు వందల కోట్ల రూపాయలు. ఈ ఇల్లు ముంబై నడిబొడ్డున ఉంది. షారుక్ ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు కొన్న ఇల్లు ఇది. ఇది కాకుండా షారూఖ్ ఖాన్‌కు దుబాయ్ మరియు లండన్‌లో ఇళ్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఇక కింగ్ ఖాన్ గ్యారేజ్ లో లగ్జరీ కార్లు, బైక్స్ ఉండనే ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.