Priyanka Chopra: నా దేశం కష్టాల్లో ఉంది ఆదుకోండి అంటూ విజ్ఞప్తి చేసిన ప్రియాంక చోప్రా…

| Edited By: Rajitha Chanti

Apr 29, 2021 | 10:50 AM

 ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా.

Priyanka Chopra: నా దేశం కష్టాల్లో ఉంది ఆదుకోండి అంటూ విజ్ఞప్తి చేసిన ప్రియాంక చోప్రా...
Follow us on

Priyanka Chopra: ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రియాంక… ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే బిజీ హీరోయిన్‌గా ఉన్నారు.  మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఎదో ఒక వార్తతో నెట్టింట సందడి చేస్తుంటుంది. అయితే ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ బ్యూటీ.

నా దేశం కష్టాల్లో ఉంది ఆదుకోండి అంటూ అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు ప్రియాంక చోప్రా. అమెరికా అవసరానికి మించి 550 మిలియన్ల అస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. వాటిలో కొంత భాగాన్ని భారత్‌కు ఇచ్చి ఆదుకోవాలని కోరింది ప్రియాంక. విదేశాల్లో సెటిల్‌ అయినప్పటికీ.. తన దేశం పట్ల ప్రియాంక బాధ్యతగా వ్యవహరించటాన్ని భారతీయులు ప్రశంసిస్తున్నారు.

అయితే ప్రియాంక చేసిన ఈ ట్వీట్ విషయంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ మీద అవగాహన కల్పించటంలో స్టార్స్ సాయం చేసి ఉంటే… పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండేవని కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజెన్లు. ఇంకొంతమంది ఇప్పటికైనా స్పందించారు చాలు అంటూ ప్రియాంక కామెంట్స్‌ను సమర్ధిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా పై సోషల్ మీడియా వేదికగా అవగాహనా కల్పిస్తూ.. ప్రజలకు దైర్యం చెప్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని , మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని, జాగ్రత్తలు వహించాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

15 Years For Pokiri Movie: ట్రెండ్ సెట్టర్.. పోకిరి సంచలనానికి 15 ఏళ్లు.. ఇప్పుడు.. ఎప్పుడూ మైండ్ బ్లాకే…

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

గ్లోబల్ స్టార్ ఐకాన్ పెద్దగా ఉపయోగపడలేదు.. ప్రియాంక చోప్రాపై చెల్లి మీరా చోప్రా సంచలన కామెంట్స్