PM Narendra Modi: ఆ సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉబ్బితబ్బిబ్బైపోతోన్న దర్శక నిర్మాతలు..

|

Mar 13, 2022 | 2:06 PM

సామాజిక అంశాలను సిల్వర్‌స్ర్కీన్‌పై అద్భ్ఉతంగా ఆవిష్కరించే దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ఒకరు.

PM Narendra Modi: ఆ సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉబ్బితబ్బిబ్బైపోతోన్న దర్శక నిర్మాతలు..
Narendra Modi
Follow us on

సామాజిక అంశాలను సిల్వర్‌స్ర్కీన్‌పై అద్భ్ఉతంగా ఆవిష్కరించే దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ఒకరు. జిద్‌, బుద్ధా ఇన్‌ ట్రాఫిక్‌ జాం వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న ఆయన ది తాష్కెంట్‌ ఫైల్స్‌ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు గానూబెస్ట్‌ స్ర్కీన్‌ప్లే రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు వివేక్‌. ఈక్రమంలో 90వ దశకంలో కశ్మీర్​ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్‌ (The Kashmir Files). అనుపమ్​ ఖేర్, మిథున్​ చక్రవర్తి, దర్శన్​ కుమార్, పల్లవి జోషి తదితర ప్రముఖులు ఈ సినిమాల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించడం విశేషం.

తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రబృందం శనివారం (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సినిమాను, చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ప్రధానితో కలిసిన ఫొటోలను చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ధన్యవాదాలు మోడీజీ అంటూ’ అని అందులో రాసుకొచ్చారు. ఇక దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి ఫ్యాన్స్‌ తో పంచుకున్నారు.

Also Read: Himachal Pradesh: మంచుకురిసే వేళలో..సైనికుల ఆటవిడుపు.. కబడ్డీ .. కబడ్డీ అంటూ పోటీపడిన జవాన్లు..

A Venu Prasad: పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు..

EPF Interest Rate: పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కు లేఖ.. బీజేపీ నిజస్వరూపం ఇదేనంటూ ఎంపీ ఫైర్