వ్యాపారవేత్తలు మాత్రమే కాదు, చాలా మంది సినీ తారలు కూడా విలాసవంతమైన వస్తువులను ఇష్టపడతారు. కొందరు కోట్ల రూపాయల వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడితే, మరికొందరు లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌బ్యాగుల్లో దర్శనమిస్తున్నారు. అదే సమయంలో, చాలా మంది సెలబ్రెటీలు వాచీలను ఇష్టపడతారు. తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు లక్షలు, కోట్లను వెచ్చించేందుకు వెనుకాడరు. ఇలాంటి అభిరుచిగల వ్యక్తుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా విడుదల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. సల్మాన్ మణికట్టు దగ్గర మెరుస్తున్న గోల్డెన్ కలర్ రోలెక్స్ కంపెనీ వాచ్‌పైనే అందరి దృష్టి. అయితే ఈ వాచ్ ఖరీదు ఎవరికీ తెలియదు.
సల్మాన్ మణికట్టు దగ్గర ప్రీమియం వాచ్
ఫిల్మ్‌ఫేర్ ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో కూడా సల్మాన్ రోలెక్స్ వాచ్ ధరించి కనిపించాడు. అంతేకాదు ఐదు రోజుల క్రితం సల్మాన్ ఖాన్ తాను వాచ్ ధరించిన చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ వాచ్ రోలెక్స్ ప్రీమియం వాచ్ అని స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వాచ్ ఖరీదు ఎంతంటే?
వేల కోట్లకు యజమాని సల్మాన్ ఖాన్. దీంతో అతను ఇప్పుడు ధరించిన వాచ్ ఖరీదు ఎంత అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది. ఎందు కంటే వాస్తవానికి సల్మాన్ ఖాన్ సింప్లిసిటీని ఇష్టపడే నటుడిగా పరిగణించబడ్డాడు. లైఫ్ స్టైల్ కూడా ఎవరికీ తెలియజేయడానికి అంతగా ఇష్టపడడు. అలాంటి సల్మాన్ ఖాన్ చాలా ఖరీదైన వాచ్ ధరించి కనిపించాడు.
సల్మాన్ ఖాన్ చేతికి ధరించిన వాచ్ రోలెక్స్ వాచ్.. దీని విలువ 57,200 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 47 లక్షల రూపాయలు. ఈ వాచ్ హై క్లాస్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. వాచ్ 18 క్యారెట్ల పసుపు, తెలుపు బంగారంతో తయారు చేయబడింది. వజ్రాలు కూడా పొదగబడ్డాయి. ఈ వాచ్‌ని డిసెంబర్ 2022లో సల్మాన్ తన పుట్టినరోజున కూడా ధరించాడని కొందరు గుర్తు చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..