బాలీవుడ్‌లోని కపూర్ కుటుంబం ప్రస్తుతం వివాహ వేడుకల్లో మునిగితేలుతోంది. రాజ్ కపూర్ మనవడు అదార్ జైన్ గోవాలో అదార్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని పెళ్లాడాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కపూర్ కుటుంబానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. కరీనా కపూర్, కరిష్మా, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అలేఖ, ఆధార్ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ వివాహ పద్దతి ప్రకారం పెళ్లి చేసుకోనున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలలో కపూర్ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కనిపిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఆధార్ జైన్ గతంలో నటి తారా సుతారియాతో డేటింగ్‌లో ఉన్నాడు. ఇద్దరూ 2020 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే 2023లో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఆధార్ జైన్ అలేఖా అద్వానీతో ప్రేమలో పడ్డాడు. ముంబైలోని ‘వే వెల్’ కమ్యూనిటీ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఆమె న్యూయార్క్‌లోని కార్నెల్ హోటల్ స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అలేఖ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అనుసరిస్తున్నారు. వీరిలో కియారా అద్వానీ, అతియా శెట్టి మరియు తారా సుతారియా ఉన్నారు.
ఆధార్ జైన్ రాజ్ కపూర్ మనవడు. రాజ్ కపూర్ కూతురు రీమా జైన్ కొడుకు. అతను రణబీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్‌ల బంధువు. గతంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
Pre-wedding Bash of #aadarjain and #alekhaadvani was hosted in Goa attended by family and close friends. Here’s a small glimpse of their white-themed wedding, including a #kiss that sealed their vows… ♥️#indianbride #indianwedding #couplelove #couplegoals #relationshipgoals pic.twitter.com/Aqfv1YzicV
— Fab Occasions™ ( The Fab App ) (@the_fab_app) January 14, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.