Kangana Viral: ఖరీదైన చీరలో మెరిసిన కంగనా.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!

|

May 09, 2022 | 6:50 AM

Kangana Viral: కాంట్రవ‌ర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ ఖరీదైన చీరలో మెరిసిపోతూ కనిపించింది. దాంతో నెటిజన్లంతా ఇప్పడు ఆ చీర గురించే చర్చించుకుంటున్నారు.

Kangana Viral: ఖరీదైన చీరలో మెరిసిన కంగనా.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Kangana
Follow us on

Kangana Viral: కాంట్రవ‌ర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ ఖరీదైన చీరలో మెరిసిపోతూ కనిపించింది. దాంతో నెటిజన్లంతా ఇప్పడు ఆ చీర గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆమె కట్టిన ఆ చీర ఖరీదు నాలుగు లక్షల పైమాటేనట.. ఇది తెలిసిన నెటిజన్లు వామ్మో ఆ ధర అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

ఈ బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ధాకడ్‌..రాజస్థాన్ జైపుర్​లోని రాజ్ మందిర్ థియేటర్​లో ధాకడ్ చిత్రంలోని తొలి సాంగ్​ను మే 5న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు కంగనా రనౌత్. తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన సారీని కంగన ఈ ఈవెంట్‌లో ధరించింది. ‘పీసెస్ ఆఫ్ యూ’ కలెక్షన్​లో భాగంగా తరుణ్ రూపొందించిన ఈ చీర ధర 4 లక్షల రూపాయలకు పైనే ఉంటుందట. ఇది తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ చీరలో కంగనా రనౌత్ రాయల్‌గా మెరిసిపోయింది. చీరకు మ్యాచింగ్‌గా కుందన్ నెక్లెస్​తో పాటు దానికి మ్యాచ్ అయ్యే చెవిపోగులను ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.