బాలీవుడ్ ఇండస్ట్రీలో జోష్, LOC కార్గిల్, లక్ష్య సినిమాలతో ఫేమస్ అయిన నటుడు శరద్ కపూర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనతో అనుచితంగా ప్రవర్తించడం.. అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో శరద్ కపూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ముంబైలోని ఖార్ పోలీసుల కథనం ప్రకారం శరద్ కపూర్ మూడు నెలల క్రితం సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేసే 32 ఏళ్ల నటికి మెసేజ్ చేశారట. అయితే అతడు శరద్ కపూర్ అని నిర్ధారించుకోవడానికి తాను వీడియో చేశానని.. ఆ తర్వాత తన టీంతో కలిసి ఓ వీడియో చేయాలని శరద్ కపూర్ కోరినట్లు తెలిపింది. దీని గురించి చర్చించడానికి తనను తన ఆఫీసుకు రమ్మని చెప్పి గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కూడా పంపించాడని.. కానీ అతడు పంపించిన అడ్రస్ ఆఫీసులా కాకుండా ఇల్లులా ఉండడంతో మొదట సందేహం కలిగిందని ఫిర్యాదులో పేర్కొంది.
ఇంట్లోకి వెళ్లగానే అక్కడున్న సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లానని చెప్పడంతో అక్కడకు వెళ్లానని.. ఆ సమయంలో శరద్ కపూర్ తనను బలవంతంగా కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించడాని ఫిర్యాదులో తెలిపింది. అతడి భారీ నుంచి పారిపోయాన తర్వాత కూడా శరద్ కపూర్ తనకు వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజులు, వీడియోస్ పంపిస్తూ వేధించాడని సదరు మహిళ వాపోయింది.
శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. చాలా సినిమాల్లో విలన్‌గా నటించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ ‘లక్ష’ వంటి కొన్ని సినిమాల్లో శరద్ కపూర్ పోషించిన పాత్రలు చాలా ఫేమస్ అయ్యాయి.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.