AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aaradhya Bachchan: హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు.. వారిపై న్యాయపోరాటం చేస్తోన్న ఐశ్వర్యరాయ్ కూతురు..

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కూతుర్ల గురించి నెగిటివ్ కామెంట్స్.. ట్రోలింగ్స్ ఎక్కవైనా.. అవేం పట్టించుకోకుండా ఉంటారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాద్య తనపై వచ్చే తప్పుడు వార్తలపై హైకోర్టును ఆశ్రయించింది.

Aaradhya Bachchan: హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు.. వారిపై న్యాయపోరాటం చేస్తోన్న ఐశ్వర్యరాయ్ కూతురు..
Aardhya Bachchan
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2023 | 11:26 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ మూల ఏం జరిగిన క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు.. వారి కుటుంబసభ్యులకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. స్టార్ హీరోహీరోయిన్స్ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని.. వారి గురించి వివిధ రకాలుగా వార్తలు వ్యాప్తి చేస్తుంటారు. ఇక సెలబ్రెటీస్ పిల్లల పట్ల వచ్చే ట్రోలింగ్స్ గురించి చెప్పక్కర్లేదు. శరీరాకృతిపై.. డ్రెస్సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కూతుర్ల గురించి నెగిటివ్ కామెంట్స్.. ట్రోలింగ్స్ ఎక్కవైనా.. అవేం పట్టించుకోకుండా ఉంటారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాద్య తనపై వచ్చే తప్పుడు వార్తలపై హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై ఆరాధ్య ఫిర్యాదు చేయగా.. ఈ కేసు విచారణ ఈరోజు హైకోర్టులో జరగనుంది.

11 ఏళ్ల మైనర్ అయిన తన గురించి.. తన ఆరోగ్యం గురించి నిరాధారమైన రూమర్స్ యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చేశాయని. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆరాధ్య తన ఫిర్యాదులో పేర్కొంది. నిజానికి ఆరాధ్య బచ్చన్ పై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని ఆరాధ్యపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు. తన కూతురిపై వచ్చే వార్తలు.. ట్రోలింగ్స్ పై విసుగుచెందిన అభిషేక్.. తన కూతురిని టార్గెట్ చేయడం మానుకోవాలని బాలీవుడ్ మీడియాను కోరారు. బాబ్ బిస్వాస్ సినిమా ప్రమోషన్లలో అభిషేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఈ ట్రోల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదు. ఇలాంటివి చేసేవారిని క్షమించాల్సిన అవసరం లేదు. నేనొక సినీ నటుడిని అయినంత మాత్రాన ఈ రంగంతో అస్సలు సంబంధంలేని నా కూతురిని టార్గెట్ చేస్తారా. నన్ను ఏమైనా అనాలనుకుంటే నా ముఖం మీద అనండి” అంటూ సీరియస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. ఈరోజుతో ఐశ్వర్య, అభిషేక్ 16 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ సమయంలో తన తల్లి ఐశ్వర్యతో కలిసి పాల్గొంది ఆరాధ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?