kareena kapoor: నెట్టింట వైరల్‌ అవుతోన్న పటౌడీ రాకుమారుల ఫొటోలు.. ఇద్దరు చిన్నారులతో కరీనా.

kareena kapoor: బాలీవుడ్‌కు చెందిన అందమైన జంటల్లో కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ జంట ఒకటి. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్యానికి మారుపేరుగా జీవిస్తున్నారు. వీరికి...

kareena kapoor: నెట్టింట వైరల్‌ అవుతోన్న పటౌడీ రాకుమారుల ఫొటోలు.. ఇద్దరు చిన్నారులతో కరీనా.
Kareena Photos

Updated on: Jul 16, 2021 | 9:28 AM

kareena kapoor: బాలీవుడ్‌కు చెందిన అందమైన జంటల్లో కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ జంట ఒకటి. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్యానికి మారుపేరుగా జీవిస్తున్నారు. వీరికి తొలి సంతానంగా 2016లో తైమూర్‌ జన్మించిన విషయం తెలిసిందే. ఈ పటౌడీ కుటుంబంలోకి ఇంకో రాకుమారుడు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఎంట్రీ ఇచ్చాడు. కరీనా రెండోసారి కూడా కుమారుడికి జన్మనిచ్చారు. అప్పట్లో ఈ వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అయితే తైమూర్‌ అడపాదపడా మీడియా కంటికి చిక్కినా.. రెండో కుమారుడు ‘జెహ్‌’ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఆ విషయానికొస్తే కరీనా, సైఫ్‌ జంట చూపించట్లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇద్దరు పటౌడీ ప్రిన్సెస్‌ ఫొటోలను షేర్‌ చేశారు. కరీనా తన కుమారులను ముద్దు చేస్తోన్న సమయంలో తీసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో అటు సైఫ్‌ అభిమానులు, ఇటు కరీనా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే కరీనా కపూర్ ఇటీవల తన ప్రగ్నెన్సీ అనుభవాలను తెలుపుతూ పుస్తక రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పుస్తక టైటిల్‌పై తీవ్ర దుమారం చెలరేగింది. కరీనా ఈ బుక్‌ను ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. దీంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్‌ సంఘాలు కరీనా బుక్‌ టైటిల్‌ను వ్యతిరేకిస్తూ శివాజీ నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. కరీనాతో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు.

Also Read: Adipurush: ఆదిపురుష్‌లో పెరుగుతోన్న భారీ తారాగణం.. తాజాగా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో.

Rashi Khanna: డిటెక్టివ్‌గా మారనున్న అందాల రాశీ.. మారుతోన్న ట్రెండ్‌ను ఒడిసి పట్టుకుంటోన్న ముద్దుగుమ్మ.

Hansika: నువ్వు నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను.. ఎమోషనల్‌ పోస్ట్ చేసిన దేశముదురు బ్యూటీ.