Ajith Kumar : గొప్పమనసు చాటుకున్న స్టార్ హీరో.. ఇడ్లీ బండి నడిపే వ్యక్తికి సాయం అందించిన అజిత్

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేవాగుణంలోను అజిత్ చాలా సార్లు తన గొప్ప మనసు..

Ajith Kumar : గొప్పమనసు చాటుకున్న స్టార్ హీరో.. ఇడ్లీ బండి నడిపే వ్యక్తికి సాయం అందించిన అజిత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2021 | 9:59 AM

Ajith Kumar : తమిళ్ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సేవాగుణంలోను అజిత్ చాలా సార్లు తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు అజిత్. ప్రస్తుతం హైదరాబాద్ లో తన తాజా చిత్రం ‘వాలిమై’ షూటింగ్ చేస్తున్నాడు అజిత్. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర్లో ఒక ఇడ్లీ బండి దగ్గర టిఫిన్ చేసేవాడట అజిత్. అయితే ఆ ఇడ్లీ బండి నడిపే వ్యక్తిని అతడి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడట. పిల్లలను చదివించడానికి చాలా కష్టమవుతుందని చెప్పడంతో అతడికి సాయం అందించాడట అజిత్.  పిల్లల చదువుకు కావాల్సిన సాయంను చేస్తానంటూ అజిత్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇడ్లీ బండి వ్యక్తి కి లక్ష రూపాయలను అజిత్ సాయంగా అందించాడని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

తెలుగులో ‘పొగరు’తో ఎంట్రీ ఇవ్వనున్న ధృవ సర్జా.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

Latest Articles