
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక విజయం సాధించిన చిత్రాల్లో దృశ్యం 3 ఒకటి. హీరో అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు విడుదలైన ఈ దృశ్యం ఫ్రాంచైజీలో అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలించింది పార్ట్ 3. భారతదేశంలో రూ. 245 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతకు ముందు విడుదలైన దృశ్యం 2 భారతదేశంలో రూ.240 కోట్లు.. దృశ్యం సినిమా భారతదేశంలో రూ.67.13 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు దృశ్యం 3 మాత్రం అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే దిశగా దూసుకుపోతోంది. 7వ రోజున, ‘దృశ్యం 3: ది కంక్లూజన్’ 15,758 షోలలో రూ.13 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.294.60 కోట్లకు, నెట్ వసూళ్లు రూ.245.50 కోట్లకు చేరాయని సాక్నిల్క్ తెలిపారు.
విదేశాలలో, ఈ చిత్రం 7వ రోజున రూ.4 కోట్లు వసూలు చేసింది, దీంతో ఇప్పటివరకు దాని మొత్తం విదేశీ వసూళ్లు రూ.89 కోట్లకు చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను రూ.383.60 కోట్లకు చేర్చింది. శుక్రవారం నాడు దృశ్యం 3 రూ. 62 కోట్లు వసూలు చేయగా, శనివారం రూ. 53.50 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాడు ఈ చిత్రం రూ. 61 కోట్లు వసూలు చేసి, తొలిరోజు వసూళ్లకు సమానంగా నిలిచింది. మంగళవారం మాదిరిగానే, బుధవారం ఉదయం, మధ్యాహ్నం షోలలో దృశ్యం3 నిశ్శబ్దంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక సాయంత్రం షోల గురించి చెప్పక్కర్లేదు. ఊహించని విధంగా హౌస్ ఫుల్ బోర్డ్స్ లతో దూసుకుపోయింది.
ఇదిలా ఉంటే దృశ్యం ఫ్రాంఛైజీలో మొదటి రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ కథ అందించగా.. ఇప్పుడు ఈ దృశ్యం ది కంక్లూజన్ చిత్రానికి సహ రచయిత అభిషేక్ పాఠక్ అందించారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ , స్టార్ స్టూడియో18 నిర్మించాయి. ఇది దృశ్యం 2 (2022) చిత్రానికి సీక్వెల్. దాని మునుపటి చిత్రాలలా కాకుండా, ఈ చిత్రం ఒక అసలైన కథను కలిగి ఉంది . కథా పరంగా దాని మలయాళ చిత్రంతో సంబంధం లేదు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, జైదీప్ అహ్లావత్, టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, ఇషితా దత్తా నటించారు.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..