‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌కు షాకిచ్చిన అజయ్‌ దేవగన్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌'లో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్‌ దేవగన్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే.

'ఆర్‌ఆర్ఆర్‌' టీమ్‌కు షాకిచ్చిన అజయ్‌ దేవగన్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 3:26 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’లో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్‌ దేవగన్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఆ మధ్యనే అజయ్‌ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో కూడా పాల్గొనగా.. ఆయన పాత్ర చిత్రీకరణ క్లైమాక్స్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అజయ్‌ గురించి జక్కన్న ఇటీవల ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్‌లో నటించేందుకు గానూ గతేడాది అజయ్‌ దేవగన్‌కు కాల్ చేశారట రాజమౌళి. అందుకు స్పందిస్తూ.. నెరేషన్‌ చెప్పడానికి ముంబయికి రావాలని కోరాలట. అక్కడికి వెళ్లిన రాజమౌళి, అజయ్‌కు దాదాపు 15-20 నిమిషాల పాటు నెరేషన్‌ చెప్పారట. జక్కన్న నెరేషన్‌కు ఫిదా అయిన అజయ్‌.. మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎప్పుడు రావాలో చెప్పండి. అప్పుడే వస్తానని చెప్పారట.

ఇక రెండు నెలల క్రితం అజయ్‌, ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో పాల్గొనగా.. అక్కడ ఆయన తీరుకు అందరూ షాక్‌కు గురయ్యారట. అసలు మనం పనిచేస్తున్నది నిజంగా అజయ్‌ దేవగన్‌తోనేనా అని చాలా మందికి అనుమానం వచ్చిందట. ఎందుకంటే సెట్స్‌లో అజయ్‌ అంత సింప్లిసిటీగా ఉంటారట. డ్రస్‌ మార్చుకోవడానికి తప్ప అజయ్.. ఎప్పుడూ తన కార్వాన్‌లోకి వెళ్లరట. అంతేకాదు భోజనం కూడా అందరితో కలిసి చెట్ల కింద తింటుంటారని.. ఒకవేళ అక్కడ చెత్త ఉన్నా కూడా ఆయన అవేమీ పట్టించుకోకుండా అందరిలో కలిసి పోయేవారని రాజమౌళి చెప్పుకొచ్చారు. అజయ్‌ తీరుతో మూవీ యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో అయినా.. పక్కనైనా అజయ్‌ చాలా నిజాయితీగా మాట్లాడతారని.. ఆయన నిజాయితీని మెచ్చే, ఆర్ఆర్ఆర్‌లో ఆయనను ఓ ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఆయనతో పనిచేయడం తన అదృష్టం అని కూడా జక్కన్న చెప్పుకొచ్చారు. కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read This Story Also: Coronavirus: కరోనా నుంచి కోలుకున్న యువరాజు..!

Latest Articles
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు
మేనిఫెస్టో సాక్షిగా.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు