యువనటి ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. వాట్సాప్ చాట్ లీక్.. వాళ్ల వేధింపులే కారణమా.. ?
సినీ రంగంలో ఇప్పుడిప్పుడే నడకలు మొదలుపెట్టిన ఓ యువ నటి ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో సంచనలం సృష్టించింది. అటు సినిమాలు, సీరియల్స్ ద్వారా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సంచితా ఉగలే సూసైడ్ కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఆమె ప్రైవేట్ చాట్ లీక్ అయినట్లు తెలుస్తోంది. సంచితా మరణానికి ముందు ఏం జరిగింది ? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో యువ నటి సంచితా ఉగలే చిన్న వయసులోనే కన్నుమూసింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న సంచిత.. అనుహ్యంగా సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడిందని.. ఇందుకు కారణంగా వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె మరణం తర్వాత అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రీ ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సంచిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ఆమెకు అవకాశాలు రావడం లేదని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని చాట్‌లు వెలుగులోకి వచ్చాయి. పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సంచిత తన ఇంట్లో ఉన్న గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు ఆ నటి మరణించినట్లు ప్రకటించారు.
ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..
సంచితా ఉగలే ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేయగా, దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. ఆమె మరణానికి గల కారణంపై ఆమె కుటుంబం తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె మానసిక ఒత్తిడికి గురైందని ఆ నటి తండ్రి ఆరోపించారు. ఆమె చనిపోవడానికి ముందు నిరంతరం వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని కొందరు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఉండేది. బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, లోపల ఆమె పూర్తిగా కుంగిపోయింది. పరిశ్రమ ఒత్తిడి కారణంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు సంచిత కుటుంబసభ్యులు.
ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..
సంచితా ఉగలే మరియు ఆమె సైకాలజిస్ట్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ చాట్‌ల ప్రకారం, సంచిత తన భవిష్యత్తు గురించి ఆందోళన, భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, షూటింగ్ సమయంలో డైలాగ్‌లను గుర్తుంచుకోవడంలో కూడా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. సంచిత ఒత్తిడితో జీవిస్తోందని, మునుపటిలా ప్రవర్తించలేకపోతోందని చాట్‌ల ద్వారా స్పష్టమవుతోంది. ఆమె ఈ విషయం గురించి డాక్టర్‌తో కూడా మాట్లాడింది. చికిత్స తర్వాత కూడా, ఆమె తనలో ఎలాంటి మార్పును గమనించలేదు. ధైర్యంగా ఉండమని డాక్టర్ ఆమెకు సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..
సంచిత వాట్సాప్ చాట్ లీక్..

Sanchita Ugale Whatsapp Cha
