Riyaz Khan: అర్దరాత్రి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు.. నటుడు రియాజ్ ఖాన్ పై నటి ఆరోపణలు..

తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.

Riyaz Khan: అర్దరాత్రి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు.. నటుడు రియాజ్ ఖాన్ పై నటి ఆరోపణలు..
Riyaz Khan
Follow us

|

Updated on: Aug 27, 2024 | 2:29 PM

మలయాళీ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. సీనియర్‌ నటులు, డైరెక్టర్లు మహిళా నటులతో వ్యవహరించిన తీరు ఒక్కొక్కటిగా బటయకొస్తున్నాయి. తమకు ఎదురైన వేధింపులపై ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సిద్ధిక్ పై లైంగిక ఆరోపణలు చేసిన మలయాళీ నటి రేవతి సంపత్, ఇప్పుడు మరో నటుడుపై తీవ్ర ఆరోపణలు చేసింది. నటుడు రియాజ్ ఖాన్ కూడా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్ కు అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

తనకు తెలియకుండానే ఓ ఫోటోగ్రాఫర్ తన ఫోన్ నంబర్ రియాజ్ ఖాన్ కి ఇచ్చాడని.. అతడు తన ఫోటోస్ చూసి రియాజ్ ఆ వ్యక్తి నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేశాడని తెలిపింది నటి రేవతి సంపత్. రియాజ్ తనకు అర్ధరాత్రి కాల్ చేసి అసభ్యకంరగా మాట్లాడాడని.. ఆఘటన జరిగినప్పుడు తనకు కేవలం 20 ఏళ్లు మాత్రమే అని.. అతడు కాల్ చేసి మాట్లాడడంతో షాకయ్యానని చెప్పుకొచ్చింది. తాను కొచ్చిలో 9 రోజులు ఉంటానని..తనకు కొంతమంది అమ్మాయిలను పంపించాలని కోరినట్లు తెలిపింది. రియాజ్ ఖాన్ పై నటి రేవతి సంపత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి.

జస్టిస్ హేమ కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కొంత మంది నటులు, నిర్మాతలు, దర్శకులు మద్యం తాగి నటీమణులను వేధించేవారని పేర్కొంది. అంగీకరించనివారిని, అంగీకరించని వారిని ఇబ్బందులకు గురిచేసి, వేధించేవారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీని వెనుక పెద్ద మాఫియా ఉందని తెలిపింది. 2017లో ఏర్పాటైన జస్టిస్‌ హేమ కమిటీ…మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దుమారం..
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దుమారం..
ఘనంగా జన్మాష్టమి వేడుకలు మధుర నుండి ద్వారక వరకు పోటెత్తిన భక్తులు
ఘనంగా జన్మాష్టమి వేడుకలు మధుర నుండి ద్వారక వరకు పోటెత్తిన భక్తులు
ఈ వాహనదారులు టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ వాహనదారులు టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు
రాష్ట్ర గవర్నర్ తొలి అధికారిక పర్యటన ఇదే..!
రాష్ట్ర గవర్నర్ తొలి అధికారిక పర్యటన ఇదే..!
'త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'..సీఎం రేవంత్‌రెడ్డి
'త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'..సీఎం రేవంత్‌రెడ్డి
భారత్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే
భారత్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే
బాబోయ్‌..ఇదిరైలు కాదు భారీ అనకొండ..!295కోచ్‌లు,ఆరుగురు లోకోమోటివ్
బాబోయ్‌..ఇదిరైలు కాదు భారీ అనకొండ..!295కోచ్‌లు,ఆరుగురు లోకోమోటివ్
ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్..
ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్..
క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..
క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో సెన్సెషన్.. తెలుగులో ఆఫర్స్ నో ఛాన్స్..
సోషల్ మీడియాలో సెన్సెషన్.. తెలుగులో ఆఫర్స్ నో ఛాన్స్..