27 August 2024
ఫుల్ జోష్‌లో త్రిష.. ఆ స్టార్ హీరోతో స్పెషల్ సాంగ్‌కు ఓకే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో సౌత్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా హీరోయిన్ త్రిష స్పెషల్ సాంగ్ చేయనుందట. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న గోట్ చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తుంది.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, అజ్మల్, మైక్ మోహన్, ప్రేమ్ జీ, మీనాక్షి చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని సెప్టెంబర్ 5న విడుదల కానున్నట్లు టాక్.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో విజయ్, త్రిషతో స్పెషల్ సాంగ్.
ఈ సినిమాలో నాలుగో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో విజయ్, త్రిషతో కలిసి సాంగ్ ఉంటుందట.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. గోట్ చిత్రంలోని నాల్గవ పాట కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. గోట్ చిత్రంలోని నాల్గవ పాట కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.