రాష్ట్ర గవర్నర్ తొలిసారి అధికారిక పర్యటన.. ఏకంగా మూడు జిల్లాలకు జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొలి అధికారిక పర్యటన చేపట్టారు. రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటింనున్నారు. పుణ్య క్షేత్రాల సందర్శన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల పరిశీలన చేస్తారు. అనంతరం లక్నవరం హాలాండ్స్ లలో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర గవర్నర్ తొలిసారి అధికారిక పర్యటన.. ఏకంగా మూడు జిల్లాలకు జిష్ణు దేవ్ వర్మ
Jishnu Dev Verma
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 27, 2024 | 2:18 PM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొలి అధికారిక పర్యటన చేపట్టారు. రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటింనున్నారు. పుణ్య క్షేత్రాల సందర్శన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల పరిశీలన చేస్తారు. అనంతరం లక్నవరం హాలాండ్స్ లలో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాజ్ భవన్ నుండి బయలుదేరిన గవర్నర్ జష్ణు దేవ్ వర్మ మొదట యాదాద్రి లక్ష్మీ నరింహస్వామిని దర్శించుకున్నారు.. కుటుంబ సమేతంగా లక్ష్మీ నరింహస్వామికి పూజలు నిర్వహించారు.. అనంతరం అక్కడి నుండి నేరుగా ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు తర్వాత గవర్నర్‌కి అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామివారి ప్రసాదం అందజేశారు ఆలయ ఈవో. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. తెలంగాణ ప్రజలందరికీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అనంతరం ములుగు కలెక్టరేట్ కు చేరుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణం రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. రామప్ప దేవాలయం వద్ద దాదాపు గంటకు పైగా గడుపుతారు. రామప్ప దేవాలయం విశిష్టతను కుటుంబ సమేతంగా తెలుసుకుని రామప్ప సరస్సును సందర్శిస్తారు. అనంతరం కోటగుల్లు సందర్శించి అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకు లక్నవరంకు చేరుకుంటారు. లక్నవరం సరస్సులో బోటింగ్, సస్పెన్షన్ బ్రిడ్జిపై కొంతసేపు గడిపిన అనంతరం ఈరోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు. లక్నవరం హాలాండ్స్ లో గవర్నర్ బస కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తొలిసారి రాష్ట్ర గవర్నర్ అధికారిక పర్యటనకు అధికార యంత్రాంగం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా మంత్రి సీతక్క రామప్ప, లక్నవరంలో ఏర్పాట్లను పరిశీలించారు. తన నియోజకవర్గంలో గవర్నర్ కు ఆతిధ్యం ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోటు లేకుందా మంత్రి సీతక్క స్వయంగా పరిశీలించారు. బోట్ లో వెళ్లి గవర్నర్ బస చేసే కాటేజ్ లను పరిశీలించారు. అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రాష్ట్ర గవర్నర్ తొలి అధికారిక పర్యటన ఇదే..!
రాష్ట్ర గవర్నర్ తొలి అధికారిక పర్యటన ఇదే..!
'త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'..సీఎం రేవంత్‌రెడ్డి
'త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'..సీఎం రేవంత్‌రెడ్డి
భారత్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే
భారత్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే
బాబోయ్‌..ఇదిరైలు కాదు భారీ అనకొండ..!295కోచ్‌లు,ఆరుగురు లోకోమోటివ్
బాబోయ్‌..ఇదిరైలు కాదు భారీ అనకొండ..!295కోచ్‌లు,ఆరుగురు లోకోమోటివ్
ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్..
ఇంటికొచ్చిన కొరియర్ ఓపెన్ చేయగా యువతికి మైండ్ బ్లాంక్..
క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..
క్రూరమైన హైనాతో వ్యక్తి ఫ్రెండ్ షిప్.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో సెన్సెషన్.. తెలుగులో ఆఫర్స్ నో ఛాన్స్..
సోషల్ మీడియాలో సెన్సెషన్.. తెలుగులో ఆఫర్స్ నో ఛాన్స్..
ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు తింటే చాలు అన్నీ సెట్..!
ఖాళీ కడుపుతో ఇవి నాలుగు ఆకులు తింటే చాలు అన్నీ సెట్..!
శభాష్ హైడ్రా.. సీఎం రేవంత్‌కు పెరుగుతున్న సపోర్ట్
శభాష్ హైడ్రా.. సీఎం రేవంత్‌కు పెరుగుతున్న సపోర్ట్
టీ20 ప్రపంచకప్‌నకు భారత మహిళల జట్టు.. లిస్టులో లేడీ మాన్‌స్టర్‌లు
టీ20 ప్రపంచకప్‌నకు భారత మహిళల జట్టు.. లిస్టులో లేడీ మాన్‌స్టర్‌లు