Rashmika: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి స్పందించిన రష్మిక.. ఏమని బదులిచ్చారంటే..

Rashmika: రష్మిక మందన.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా పుష్ప (Pushpa) సినిమా విడుదల తర్వాత రష్మిక పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా...

Rashmika: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి స్పందించిన రష్మిక.. ఏమని బదులిచ్చారంటే..
Rashmika
Follow us

|

Updated on: Mar 01, 2022 | 7:10 AM

Rashmika: రష్మిక మందన.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా పుష్ప (Pushpa) సినిమా విడుదల తర్వాత రష్మిక పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా (National Crush) మారింది. టాలీవుడ్‌తో (Tollywood) పాటు బాలీవుడ్‌లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే రష్మిక సినిమాలతో ఎంత పేరు సంపాదించుకుంటుందో తన చుట్టూ చక్కర్లు కొడుతోన్న రూమర్స్‌తోనూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక, విజయ్‌లు పెళ్లి చేసుకోనున్నారనే వార్త తెగ వైరల్‌ అయ్యింది. వీరిద్దరూ న్యూ ఇయర్‌ వేడుకలు ఒకే చోట జరుపుకున్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుందంటూ నెట్టింట వార్త తెగ సందడి చేసింది. అయితే ఈ విషయమై విజయ్‌ తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ తమ పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని ఒకింత కఠినంగానే బదులిచ్చాడు విజయ్‌.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వార్తపై రష్మిక కూడా స్పందించారు. రష్మిక నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ రష్మిక బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక చుట్టూ వస్తోన్న వార్తలపై మీడియా ప్రతినిధులు అడిగిన వార్తపై స్పందించింది.

ఈ విషయమై రష్మిక బదులిస్తూ.. ‘ఆ వార్తుల నా దృష్టికి కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు నాకు కొత్తకాదు. వాటిని విని నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు’ అని రష్మిక తేల్చి చెప్పింది. మరి రష్మిక చెప్పిన సమాధానంలో నిజంగా నిజం ఉందా.? లేదా ఈ నేషనల్‌ క్రష్‌ ఏమైనా దాస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: మూడో పెళ్లి కోసం.. రెండో భార్యను చంపి.. మొదటి భార్యను కూడా ఇలాగే

Watch Video: ఈ క్యాచ్ ఓ ‘అద్భుతం’.. అలా ఎలా పట్టావయ్యా బాబు.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో