Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

సీనియర్ హీరోయిన్ జయప్రద ఫాలోయింగ్ గించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలపాటు సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కథానాయికగా, సహయ నటిగా అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తనకు ఇష్టమైన ఓ హీరో గురించి చెప్పుకొచ్చారు.

Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..
Jaya Prada

Updated on: Oct 09, 2026 | 11:57 AM

అగ్ర తార జయప్రద తన సినీ ప్రస్థానం, సహనటులు, కొన్ని మర్చిపోలేని అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో మొదలుకొని ప్రస్తుత తరం నటుల వరకు సుమారు మూడు తరాల వారితో కలిసి నటించిన అనుభవం తనదని జయప్రద తెలిపారు. ముఖ్యంగా కే. బాలచందర్ గారి స్కూల్ నుండి వచ్చిన రజనీకాంత్, కమల్ హాసన్‌లతో తన అనుబంధం గురించి ప్రస్తావించారు. “మేమంతా ఒకే స్కూల్ నుండి వచ్చాం. ముగ్గురం ఒకేసారి పెద్ద పోసిషన్స్‌కు రావడం, ఒకేలాంటి ఆలోచనలతో ఉండటం ప్రత్యేకమైనది” అని ఆమె అన్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టడం, తాను రాజకీయాల్లోకి వెళ్లడం, రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవడం వంటివి ఒకే ధోరణిని సూచిస్తాయని ఆమె వివరించారు. నందమూరి బాలకృష్ణపై జయప్రద ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ గారి దీప చిత్రం తర్వాత బాలకృష్ణతో చిన్నతనంలో నటించే అవకాశం మిస్ చేసుకున్నానని, ఇప్పటికీ ఆ విషయం తనకు గుర్తుందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మహారథి చిత్రంలో బాలకృష్ణకు అత్తగా నటించిన అనుభవం తనకు ఎంతో నచ్చిందని, ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణతో మళ్లీ అలాంటి శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. “బాల అంటే నాకు చాలా ఇష్టం. తను మొహమాటం లేకుండా మాట్లాడతాడు. గుండె మాత్రం చాలా మంచిది, మనస్ఫూర్తిగా మాట్లాడే మనిషి” అని జయప్రద అన్నారు. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ అద్భుతమని, తనకు అలాంటి షాట్ చేయడానికి ఏడాది పడుతుందని ఆమె అన్నారు.

ఒక మర్చిపోలేని ప్రమాదకరమైన సంఘటనను కూడా జయప్రద వివరించారు. బాలయ్య గారి సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి నుండి వస్తుండగా ట్రైన్ వరదల్లో చిక్కుకుందని తెలిపారు. అప్పటి పరిస్థితిని వివరిస్తూ, “ట్రాక్ మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. ట్రైన్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. పై బెర్త్‌లో పడుకున్న నేను ఒక్కసారిగా ఒకవైపుకు పడిపోయాను. ట్రైన్ ఒక సింగిల్ ట్రాక్‌పై నిలబడి, మళ్ళీ ఫ్లాట్ అయ్యి బయటకి వచ్చింది” అని తెలిపారు. మూడు రోజుల పాటు ట్రైన్‌లో తిండి లేక, బయటకి వెళ్ళడానికి అవకాశం లేక తమ కుటుంబం పడిన బాధను ఆమె వివరించారు. అటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా జనం వరద నీటిలో నిలబడి “జయప్రద గారు బయటకి రావాలి” అని అరిచారని, ఆ సంఘటన తనకు ఎంత భయంకరంగా అనిపించిందో గుర్తు చేసుకున్నారు. అప్పుడు ట్రైన్ ఆఫీసర్ ద్వారా ఆహారం అందిందని, ఆ తర్వాత ట్రాక్‌లు వేసిన తర్వాత తమను తరలించారని ఆమె వివరించారు.

తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన అంతులేని కథ చిత్రం గురించి మాట్లాడుతూ, ఇప్పటికీ ఆ చిత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, చాలా మంది అమ్మాయిలు ఇప్పటికీ ఆ పాత్రతో తమను పోల్చుకుంటారని జయప్రద అన్నారు. “ఈ క్యారెక్టర్ ప్రతి కుటుంబంలోనూ, ప్రతి అమ్మాయికీ, తల్లిదండ్రులకూ కావాలని కోరుకుంటారు” అని ఆమె అన్నారు. మొదట బాలచందర్ గారు తమిళ వెర్షన్ చూపించినప్పుడు, ఇంత పెద్ద పాత్రను ఎలా చేయగలనని భయపడ్డానని తెలిపారు. అయితే, తర్వాత ట్రయల్స్ ఇచ్చి, గెటప్ మార్పులు చేసి, రెండు పెట్టికోట్లు, పెద్ద హీల్స్‌తో ఆ పాత్రను సిద్ధం చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. అంతులేని కథ ఒక గొప్ప త్యాగపూరిత పాత్ర అని, “కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు” అనే ఆత్రేయ గారి పాట వింటే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు వస్తాయని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

జయప్రద, బాలకృష్ణ..

Jaya Prada News

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

Loading...
Unable to load recommendations.
Follow Us