150కి పైగా సినిమాల్లో హీరోయిన్.. 40 ఏళ్ల వయసులోనే దీనస్థితిలో మరణించింది.. సీనియర్ నటుడు కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అశ్విని గురించి సీనియర్ నటుడు ప్రేమ్ సాగర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కథానాయికగా మెప్పించిన ఆమె జీవితం విషాదరీతిలో ముగిసిందని అన్నారు. అశ్విని మరణం చుట్టూ అలుముకున్న అనేక అనుమానాలకు తన విన్న వివరాలను పంచుకున్నారు. 40 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూశారని ప్రేమ్ సాగర్ తెలిపారు.

టాలీవుడ్లో ఒకప్పుడు వెలుగొంది, వందకు పైగా చిత్రాల్లో నటించిన అందాల తార అశ్విని దారుణమైన పరిస్థితుల్లో కన్నుమూయడంపై ఇప్పటికీ పలు అనుమానాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ప్రేమ్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అశ్వినితో సినిమాలు, ఆమె జీవితం గురించి తాను విన్న వివరాలను, ఆమెతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రేమ్ సాగర్ తన కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమను ఎందుకు వదిలి వెళ్లారు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అశ్వినిని దారుణంగా మోసం చేశారనే వార్తలపై ప్రేమ్ సాగర్‌ను ప్రశ్నించగా, ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అశ్విని గారు వంద సినిమాల పైగా చేశారు. చాలా మంచి అందగత్తె. కానీ 40 సంవత్సరాలకే ఊపిరితిత్తుల క్యాన్సరు, ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేక, కొంతమంది మోసం చేసి, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు లేక, కనీసం హాస్పిటల్ కి వెళ్ళటానికి ఖర్చులకి డబ్బులు లేక ఆమె చాలా దీన స్థితిలో చనిపోయారు” అని ప్రేమ్ సాగర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమెను చాలా మోసం చేశారని తాను విన్నట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
ప్రేమ్ సాగర్ అశ్వినితో కలిసి “మూడుళ్ళ ముచ్చట” చిత్రంలో నటించారు. ఆ సినిమా సమయంలోనే అశ్వినికి అవకాశాలు ఎక్కువగా వచ్చేవని, ఆమె అప్పుడే పీక్ స్టేజ్‌కు చేరుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, తాను చిత్ర పరిశ్రమ నుంచి మధ్యలోనే తప్పుకున్నానని, అశ్విని మరణవార్త తనకు ఆలస్యంగా తెలిసిందని వివరించారు. ఈ సంఘటనను వివరిస్తూ, తాను నిహారిక గారి “ఫ్యామిలీ స్టోరీ” ప్రాజెక్టులో ఒక క్యారెక్టర్ చేస్తుండగా, నటి తులసి గారు కూడా అందులో నటించారని చెప్పారు. తాను అశ్విని గురించి తులసితో ప్రస్తావించగా, “నాకెందుకు తెలియదండి? మీకు ఎలా తెలుసు దీనికి 40 సంవత్సరాలు అయిపోతే మీకు ఎలా… లేదు లేదు రీసెంట్ గా యూట్యూబ్ లో మన క్లిప్స్ అన్నీ వేశారు. ఆ క్లిప్స్ చూశాను ఒక వారం రోజుల లోపల. అందుకే నా మైండ్ లో ఉంది. అప్పుడు మేడం గారు చెప్పారు, తులసమ్మ చెప్పింది. ఆరు సంవత్సరాలు అయింది ఆవిడ క్యాన్సర్ తో చచ్చిపోయింది” అని తులసి ద్వారానే అశ్విని మరణ వార్త తెలిసిందని ప్రేమ్ సాగర్ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
అశ్విని ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మోసాల గురించి మాట్లాడుతూ, “ఈ ఫైనాన్షియల్ గా మీరు చెప్పేవి అన్నీ అక్కడక్కడా వినటమే. నేను… ఐ యామ్ నాట్… డైరెక్ట్ విట్నెస్ కాదు నేను. డైరెక్ట్ విట్నెస్ కాదు. అవి వినటమే” అని ప్రేమ్ సాగర్ స్పష్టం చేశారు. అయితే, “కొంతమంది తెలిసిన వాళ్లే మోసం చేశారు ప్రేమ పేరుతో…” అని విన్న మాటలను ఆయన వెల్లడించారు. కోడంబాకంలో తాము పక్కపక్క రూమ్‌లలోనే ఉండేవారిమని, తాను పైన ఉండగా, అశ్విని తన కుటుంబం (అమ్మ, నాన్న, బ్రదర్స్)తో పాటు పక్క ఇంట్లో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అశ్విని మంచి నటి అని, ఆమె కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడే ఈ విషాదం చోటుచేసుకుందని ప్రేమ్ సాగర్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
