మహానటిపై జమున లేటెస్ట్ కామెంట్స్..

| Edited By:

May 07, 2019 | 1:17 PM

తెలుగు తెరపై అలనాటి హీరోయిన్లుగా సావిత్రి.. జమున వెండితెరను ఏలారు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవలే ఒక వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి జమున మాట్లాడుతూ.. సావిత్రి బయోపిక్‌ గురించి ప్రస్తావించారు. సావిత్రి గురించి బయోపిక్ తీసేటప్పుడు తనను ఎవరూ సంప్రదించలేదని.. ఆ విషయం చాలా బాధను కలిగించిందని పేర్కొన్నారు. సావిత్రితో కలిసి తాను చాలా సినిమాల్లో నటించానని.. సావిత్రి గురించిన ఎన్నో విషయాలు తనకు తెలుసని పేర్కొన్నారు. సావిత్రి జీవితం గురించి […]

మహానటిపై జమున లేటెస్ట్ కామెంట్స్..
Follow us on

తెలుగు తెరపై అలనాటి హీరోయిన్లుగా సావిత్రి.. జమున వెండితెరను ఏలారు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవలే ఒక వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి జమున మాట్లాడుతూ.. సావిత్రి బయోపిక్‌ గురించి ప్రస్తావించారు.

సావిత్రి గురించి బయోపిక్ తీసేటప్పుడు తనను ఎవరూ సంప్రదించలేదని.. ఆ విషయం చాలా బాధను కలిగించిందని పేర్కొన్నారు. సావిత్రితో కలిసి తాను చాలా సినిమాల్లో నటించానని.. సావిత్రి గురించిన ఎన్నో విషయాలు తనకు తెలుసని పేర్కొన్నారు. సావిత్రి జీవితం గురించి అందరికంటే ఎక్కువగా నాకే తెలిసిందని పేర్కొన్నారు. తన జీవితంలోని కష్టాలను.. బాధలను ఆమె నాతోనే పంచుకునేదని.. అలాంటిది సావిత్రి బయోపిక్ తీసేముందు నా అభిప్రాయాలను కూడా తీసుకుని వుంటే, సినిమాకి మరింత ఉపయోగకరంగా ఉండేదని భావిస్తున్నట్లు జమున తెలిపారు.