హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శనివారం(అక్టోబర్ 5) పూర్తయింది. హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. అయితే ఇవాళ ఎన్నికల చివరి దశ ముగియగానే భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్న మాట. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది.
రెండు రాష్ట్రాలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేసింది. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఈ సంస్థ ఎగ్జిట్‌పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 55 స్థానాల్లో గెలిచే అవకాశముంది. బీజేపీకి 26 స్థానాలు మాత్రమే దక్కే అవకాశముంది. జేజేపీకి 1 , ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు లభించే అవకాశముంది. బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకుంది.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో హంగ్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక 90 స్థానాలు ఉన్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు- NC కూటమికి 46 నుంచి 50 స్థానాలు దక్కే అవకాశముంది. ఎన్డీఏ కూటమికి 23 నుంచి 27 స్థానాలు దక్కే అవకాశముంది. పీడపీకి 7 నుంచి 11 సీట్లు , ఇతరులకు నాలుగు నుంచి ఐదు సీట్లు దక్కే అవకాశాలున్నాయి.
హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందా ? లేక కాంగ్రెస్ పదేళ్ల తరువాత అధికారం లోకి వస్తుందా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. అక్టోబర్ 8వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
ఇక హర్యానాలో 61 శాతం పోలింగ్ నమోదయ్యింది. జమ్ముకశ్మీర్‌లో కూడా భారీగా పోలింగ్ నమోదయ్యింది.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్
హర్యానా –
బీజేపీ: 18-24
కాంగ్రెస్: 55-62
జేజేపీ: 0-3
INLD: 3-6
AAP: 0
ఇతరులు: 2-5
జమ్ము కశ్మీర్
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయమని తేల్చేసింది. 55 నుంచి 62 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అధికారంలోకి వస్తుందని, బీజేపీ 18 నుంచి 24 స్థానాలకే పరిమితమవుతుందని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జననాయక జనతా పార్టీ సున్నా నుంచి 3 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. INLD 3 నుంచి 6 స్థానాల్లో గెలుస్తుందని, ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో గెలుస్తారని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..