దొంగలను పరుగులు పెట్టించిన వృద్ధ దంపతులు..!

Elderly couple beats the thieves at Tirunelveli in Tamil Nadu

తమిళనాడులో ఓ వృద్ధ దంపతులు.. సాహసాన్ని ప్రదర్శించారు. దోపిడీకి తెగబడిన దుండగులకు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లా కళ్యాణపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షణ్ముకవేల్ దంపతులు ఇంట్లో వుండగా కత్తులతో దాడికి యత్నించారు దొంగలు. ప్రతిఘటించిన యజమానులు దొంగలను తరిమికొట్టారు. వృద్ధుల సాహసంతో దొంగలు వెనుదిరిగారు. దంపతులను హతమార్చి.. ఇంటిని దోచుకెళ్లాలని అనుకున్న దొంగలకు షాక్ తగిలింది. వాళ్ల పక్కా ప్లాన్‌కు వృద్ధదంపతులు గట్టిగా సమాధానమిచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం.. కత్తులతో వృద్ధ దంపతులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో దొంగలను తమ సాహసంతో.. వృద్ధ దంపతులు తరిమికొట్టారు. దీంతో.. ఆ దొంగలు వెనుదిరిగారు. కాగా.. వృద్ధ దంపతుల సాహసాన్ని తెలిసిన ప్రతీ ఒక్కరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు.

Elderly couple beats the thieves at Tirunelveli in Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *