బిడ్డలను చంపిన తల్లికి 120ఏళ్ల జైలు శిక్ష

అతి దారుణంగా కన్నబిడ్డలను కడతేర్చిన ఓ తల్లికి అమెరికా న్యాయస్థానం కఠిన శిక్షను విధించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకుగానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల వరకు పెరోల్‌ సాధ్యం కాని విధంగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్‌ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015లో కుమార్తె అలీషా, కుమారుడు డారన్‌ను హత్య చేసింది. ఆ తరువాత ఆ మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకొని, మూడు రోజులు గడిపింది. అయితే ఆమె ఇంటి నుంచి […]

బిడ్డలను చంపిన తల్లికి 120ఏళ్ల జైలు శిక్ష
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2019 | 2:16 PM

అతి దారుణంగా కన్నబిడ్డలను కడతేర్చిన ఓ తల్లికి అమెరికా న్యాయస్థానం కఠిన శిక్షను విధించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకుగానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల వరకు పెరోల్‌ సాధ్యం కాని విధంగా జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్‌ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015లో కుమార్తె అలీషా, కుమారుడు డారన్‌ను హత్య చేసింది. ఆ తరువాత ఆ మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకొని, మూడు రోజులు గడిపింది. అయితే ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్యల విషయం స్థానికులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి మూరేను అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే దేవుడు చెబితేనే తన పిల్లలను చంపానని మూరే విచారణలో చెప్పింది. వారిని మళ్లీ బతికించుకునేందుకే మృతదేహాలను ఇంట్లో ఉంచుకున్నట్లు తెలిపింది. ఇక ఈ కేసు విచారణ ఈ ఏడాది మార్చిలో పూర్తి కాగా.. గురువారం న్యూహెవెన్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఇది చాలా తీవ్రమైన ఘటన అని.. దోషికి శిక్ష పడాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. 120ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.