నిండుకుండలా హిమాయత్ సాగర్.. 12 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే హిమాయత్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. ఎగువ నుంచి భారీగా తరలివస్తోన్న వరదనీటితో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. దీంతో జలమండలి అధికారుల ఆదేశాలమేరకు శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా గేట్లు ఎత్తుతున్నారు. వరద ఉధృతి మళ్లీ భారీగా పెరగడంతో తెల్లవారుజామున ఒకేసారి మరో 6 గేట్‌లను తెరిచారు. అంతకుముందు, శనివారం సాయంత్రం హిమాయత్ సాగర్ చెరువు ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేసి నీటిమట్టాన్ని క్రమబద్దీకరించే ప్రయత్నం చేశారు. అయితే, నిన్న […]

నిండుకుండలా హిమాయత్ సాగర్.. 12 గేట్లు ఎత్తివేత
Follow us

|

Updated on: Oct 18, 2020 | 8:14 AM

హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే హిమాయత్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. ఎగువ నుంచి భారీగా తరలివస్తోన్న వరదనీటితో ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుకుంది. దీంతో జలమండలి అధికారుల ఆదేశాలమేరకు శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా గేట్లు ఎత్తుతున్నారు. వరద ఉధృతి మళ్లీ భారీగా పెరగడంతో తెల్లవారుజామున ఒకేసారి మరో 6 గేట్‌లను తెరిచారు. అంతకుముందు, శనివారం సాయంత్రం హిమాయత్ సాగర్ చెరువు ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేసి నీటిమట్టాన్ని క్రమబద్దీకరించే ప్రయత్నం చేశారు. అయితే, నిన్న సాయంత్రం నుండి మళ్లీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం12 గేట్లను 5 ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెడుతున్నారు.