డ్రగ్స్‌ కేసు.. నాకు ఏం బాధ లేదు బ్రదర్‌: నవదీప్‌

అటు బాలీవుడ్, ఇటు శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన రియా చక్రవర్తి పలువురి పేర్లు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి

  • Tv9 Telugu
  • Publish Date - 4:27 pm, Sat, 12 September 20

Navdeep Drugs Case: అటు బాలీవుడ్, ఇటు శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు వెంటాడుతోంది. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన రియా చక్రవర్తి పలువురి పేర్లు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సారా అలీ ఖాన్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అటు బాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ టెన్షన్ నెలకొంది. రియా ఇంకా ఎవరి పేర్లు చెప్పిందన్న ప్రశ్న ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దానికి తోడు రియా కాల్ లిస్ట్‌లో రానా పేరు కూడా ఇటీవల లీక్ అయ్యింది. ఈ క్రమంలో రానా, నవదీప్ ఇలా పలువురి పేర్లు ఈ కేసులో వినిపిస్తాయంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో వాటిపై నవదీప్ స్పందించారు. నాకు ఏ బాధ లేదు బ్రదర్‌, నువ్వు కూడా ఏ బాధపడకు. పదా పనొచ్చే పనులు చేసుకుందాం అని కామెంట్ పెట్టారు. అయితే మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో లింక్‌లు ఉన్నాయంటూ 15 మంది టాలీవుడ్‌ ప్రముఖులకు అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించారు. వారిలో పూరీ జగన్నాథ్, రవి తేజ, ఛార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, తనీష్ సహా పలువురి పేర్లు ఉన్నాయి. వీరిని విచారించడంతో పాటు డ్రగ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ కూడా సేకరించిన విషయం తెలిసిందే.

 

Read More:

నాణ్యమైన విద్యుత్ పొందడం రైతు హక్కు: డొక్కా

తమిళ్‌లో రీమేక్ అవ్వనున్న ‘దియా’!