దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు!

దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు. వైద్యులు మరోసారి దేశ వ్యాప్త బందుకు పిలపునిచ్చారు. దీంతో.. రోగులు ఆస్పత్రుల మెట్లెక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప.. ఏ కేసులను వైద్యులు టేకప్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి.. రేపు ఉదయం 6 గంటల వరకూ వైద్యులు బంద్‌ను కొనసాగించనున్నారు. బంద్‌కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు, జూనియర్ వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులు మద్దతు తెలియజేస్తున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలకు […]

దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 2:46 PM

దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు. వైద్యులు మరోసారి దేశ వ్యాప్త బందుకు పిలపునిచ్చారు. దీంతో.. రోగులు ఆస్పత్రుల మెట్లెక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప.. ఏ కేసులను వైద్యులు టేకప్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి.. రేపు ఉదయం 6 గంటల వరకూ వైద్యులు బంద్‌ను కొనసాగించనున్నారు. బంద్‌కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు, జూనియర్ వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రులు మద్దతు తెలియజేస్తున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వైద్య సేవల నిలిపివేతతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా.. తీసుకొచ్చిన ఎఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళన కొనసాగుతుండగా.. ఇవాళ అవి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ బిల్లును నిరసిస్తూ 5 వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఢిల్లీ వేదికగా సోమవారం నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్ల తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.

కాగా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వ్యాప్తంగా కూడా.. ఈ బంద్ నడుస్తుంది. జిల్లాలా వారీగా.. మండలాల వారీగా డాక్టర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వైద్యులకు మద్దతుగా ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. దీనిపై కేంద్రం వెంటనే మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..