చంద్రబాబుతో శివప్రసాద్ అనుబంధం ఎప్పట్నుంచో తెలుసా.. వింటే షాక్ అవుతారు.!

TDP Leader Shivaprasad Passes Away, చంద్రబాబుతో శివప్రసాద్ అనుబంధం ఎప్పట్నుంచో తెలుసా.. వింటే షాక్ అవుతారు.!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్ర ధిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పార్టీలో కలిసి పనిచేయడమే కాదు.. వీరి మధ్య ఏదో పాత అనుబంధం ఉందని చంద్రబాబు విషణ్న వదనాన్ని చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. అదేంటా అని పార్టీ వర్గాలు, నాయకులు గుసగుసలాడుకోవడం శివప్రసాద్ మరణవార్త బయటకు పొక్కిన నుంచి మొదలైంది. ఇదే విషయమై టీవీ9 తెలుగు వెబ్ సైట్ కూపీ లాగే ప్రయత్నం చేసింది. అప్పుడే అరుదైన ఈ ఫోటో వెలుగులోకి వచ్చింది.

TDP Leader Shivaprasad Passes Away, చంద్రబాబుతో శివప్రసాద్ అనుబంధం ఎప్పట్నుంచో తెలుసా.. వింటే షాక్ అవుతారు.!

కాగా, చంద్రబాబు, శివప్రసాద్‌ల పరిచయం ఈనాటిది కాదు. శివప్రసాద్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే వీరిద్దరికీ పరిచయం ఉందని పై ఫోటో చూస్తే అర్థమైపోతుంది. స్కూల్లో చదువుకున్న రోజుల నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు. చిన్నతనంలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. క్లాస్ మేట్స్ కూడా. రోజూ కలిసి ఆడుకునే వారు. అయితే చదువు పూర్తైన తర్వాత చంద్రబాబు రాజకీయాల పైపు వెళ్లగా.. శివప్రసాద్ డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డారు. ఆ తరువాత నటన మీద మోజుతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. నటనలో రాణిస్తూనే.. చంద్రబాబు చొరవతో శివప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *