థర్డ్ ఫ్రంట్‌కు నో ఛాన్స్ : స్టాలిన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీపై స్పందించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. కేసీఆర్ చెన్నై పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని ఆలయాల సందర్శన కోసం వచ్చిన కేసీఆర్ తనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని స్పష్టం చేశారు. రాజకీయాలు చర్చించడానికి కేసీఆర్ తమిళనాడు రాలేదని.. ఈ భేటీపై బీజేపీ నేతలు ఊహాజనితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు స్టాలిన్. దేశ రాజకీయాల్లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:50 pm, Tue, 14 May 19

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీపై స్పందించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. కేసీఆర్ చెన్నై పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని ఆలయాల సందర్శన కోసం వచ్చిన కేసీఆర్ తనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని స్పష్టం చేశారు.

రాజకీయాలు చర్చించడానికి కేసీఆర్ తమిళనాడు రాలేదని.. ఈ భేటీపై బీజేపీ నేతలు ఊహాజనితమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు స్టాలిన్. దేశ రాజకీయాల్లో ఒకటి బీజేపీ కూటమి, మరొకటి కాంగ్రెస్ కూటమి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాతే థర్డ్ ఫ్రంట్‌పై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. మరోవైపు తమ పార్టీతో స్టాలిన్ చర్చలు జరిపిన మాట వాస్తవమేనని తమిళనాడు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. మారుతున్న పరిణామాల నేపథ్యంలో డీఎంకే.. కాంగ్రెస్, బీజేపీలకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది.