సానియా నువ్వు చేసిన పనికి… వీణా మాలిక్ వ్యధ

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ అనేదే లేకుండా పాకిస్థాన్ చేతులెత్తేసింది. భార‌త్‌పై నెగ్గ‌లేక‌పోయిన పాకిస్థాన్ జ‌ట్టుపై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి మాజీ ఆట‌గాళ్ల వ‌ర‌కు అందరూ పాక్ టీమ్‌ను విమ‌ర్శిస్తున్నారు. అలాగే ఈ అప‌జ‌యం పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడు షోయ‌బ్ మాలిక్ భార్య సానియా […]

సానియా నువ్వు చేసిన పనికి... వీణా మాలిక్ వ్యధ
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 6:00 PM

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో మురిపించింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ అనేదే లేకుండా పాకిస్థాన్ చేతులెత్తేసింది. భార‌త్‌పై నెగ్గ‌లేక‌పోయిన పాకిస్థాన్ జ‌ట్టుపై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి మాజీ ఆట‌గాళ్ల వ‌ర‌కు అందరూ పాక్ టీమ్‌ను విమ‌ర్శిస్తున్నారు. అలాగే ఈ అప‌జ‌యం పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడు షోయ‌బ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు కూడా త‌లనొప్పులు తెచ్చిపెట్టింది. సోష‌ల్ మీడియాలో సానియాపై ట్రోలింగ్ మొద‌లైంది. సానియా తీరును విమ‌ర్శిస్తూ పాక్ మీడియా కూడా క‌థ‌నాలు వెలువరుస్తోంది.

మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేయనీయ‌కుండా షోయబ్ మాలిక్‌ను సానియా రెస్టారెంట్‌కు తీసుకు వెళ్లిందంటూ పాకిస్తాన్ మీడియాలో కథనం ప్రసారం అయ్యింది. ఈ క్రమంలో రెస్టారెంట్‌లో షోయ‌బ్ జంక్ ఫుడ్ తిన్నాడని, మ‌ద్యం కూడా సేవించాడ‌ని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా సానియాపై ట్రోలింగ్‌కు పాల్ప‌డుతున్నారు. ఇండియా గెలుపు కోసమే సానియా అక్కడకు వెళ్లిందని, పాక్ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతినేలా ఈమె ప్రవర్తించిందని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించిన‌ పాక్ బ్యూటీ వీణా మాలిక్ సైతం సానియాను ట్విట‌ర్ వేదికగా విమ‌ర్శించింది.

‘‘సానియా.. మీ అబ్బాయి గురించి నేనేంతో ఆందోళన చెందుతున్నా. మీరు అతణ్ని హుక్కా పీల్చే చోటుకు తీసుకెళ్లారు. ఇది బాబుకి ప్రమాదకరం కాదా..? నాకు తెలిసినంత వరకు పిల్లలకు, అథ్లెట్లకు జంక్ ఫుడ్ మంచిది కాదు. ఓ తల్లిగా, అథ్లెట్‌గా నీకు ఈ విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి’’ అని వీణా మాలిక్ సానియాకు ట్వీట్ చేసింది.

మిగతా వాళ్ల కంటే నా కొడుకు పట్ల నేనేంతో శ్రద్ధ పెడతానని.. సానియా బదులిచ్చింది. షోయబ్ మాలిక్ జంక్ ఫుడ్ అలవాట్ల గురించి స్పందిస్తూ.. ‘‘నేను పాకిస్థాన్ క్రికెట్ జట్టు డైటీషియన్‌ను కాదు. పాక్ క్రికెటర్లు ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు నిద్ర లేస్తున్నారు, ఏం తింటున్నారో నేనేమీ వాళ్ల ప్రిన్సిపాల్‌నో లేదా టీచర్‌నో కాదు కదా. నువ్వు చూపిన అభిమానానికి ధన్యవాదాలు’’ అని సానియా బదులిచ్చింది.