Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

పోర్న్‌సైట్లపై కోర్టుకెక్కిన దివ్యాంగుడు.. రీజన్ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

Deaf Man In New York Sues Porn Websites. Here's Why, పోర్న్‌సైట్లపై కోర్టుకెక్కిన దివ్యాంగుడు.. రీజన్ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

పోర్న్‌సైట్ల విషయమై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కోర్టుమెట్లెక్కాడు. అయితే వాటిని వ్యతిరేకిస్తూ.. లేదా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడనుకుంటే.. పొరబాటే. సదరు వ్యక్తి ఓ దివ్యాంగుడు. బధిరుడైన ఆ వ్యక్తి.. పోర్న్ సైట్లు మా దివ్యాంగుల పట్ల విపక్ష చూపుతున్నాయని ఆరోపిస్తూ.. న్యాయస్థానం తలుపుతట్టాడు. బ్రూక్లిన్ కోర్టులో గురువారం ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. యారొస్లావ్ సూరిస్ అనే వ్యక్తి పుట్టుకతో చెవిటి. కొన్ని పోర్న్‌సైట్లలో తనలాంటి వారికి వివక్ష ఎదురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోర్న్ సైట్లలోని వీడియోలకు సబ్‌టైటిల్స్ జత చేయకుండా సదరు వెబ్‌సైట్లు.. తమలాంటి వారిపై వివక్ష చూపుతున్నాయని మండిపడ్డాడు. ఇది అమెరికా వికలాంగుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడ్డాడు. తనకు పరిహారం ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే పరిహారంగా ఎంతమొత్తం కోరాడనేది మాత్రం తెలియరాలేదు. పోర్న్‌వెబ్‌సైట్లలోని వీడియోలలో.. కింద సబ్ టైటిల్స్ కానీ.. క్యాప్షన్లు కానీ.. లేకపోవడంతో.. తనలాంటి దివ్యాంగులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు.

Related Tags