గుజరాత్‌కు తప్పిన ముప్పు.. దిశ మార్చుకున్న ‘వాయు’

గుజరాత్ రాష్ట్రానికి వాయు తుఫాన్ గండం తప్పింది. తీరం వైపు వాయువేగంతో దూసుకొస్తున్న ‘వాయు’ తుఫాన్ తన దిశను మార్చుకుని… సముద్రంలోకి పయనిస్తోంది. దీంతో మూడు రోజుల నుంచి కునుకు లేకుండా పని చేస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాన్ దిశ మార్చుకున్నప్పటికీ పశ్చిమ తీర ప్రాంతంలో ఇంకా హై అలెర్ట్ కొనసాగుతోంది. పశ్చిమ తీరంలో 48 గంటల పాటు హై అలెర్ట్… గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రం ఉవ్వెత్తున […]

గుజరాత్‌కు తప్పిన ముప్పు.. దిశ మార్చుకున్న 'వాయు'
Follow us

|

Updated on: Jun 14, 2019 | 1:32 PM

గుజరాత్ రాష్ట్రానికి వాయు తుఫాన్ గండం తప్పింది. తీరం వైపు వాయువేగంతో దూసుకొస్తున్న ‘వాయు’ తుఫాన్ తన దిశను మార్చుకుని… సముద్రంలోకి పయనిస్తోంది. దీంతో మూడు రోజుల నుంచి కునుకు లేకుండా పని చేస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాన్ దిశ మార్చుకున్నప్పటికీ పశ్చిమ తీర ప్రాంతంలో ఇంకా హై అలెర్ట్ కొనసాగుతోంది.

పశ్చిమ తీరంలో 48 గంటల పాటు హై అలెర్ట్…

గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో పాటు సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రానున్న 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు అధికారులు ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించడమే కాకుండా తక్షణ సాయం అందించేందుకు 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.

 ముంబైకు రెడ్ అలెర్ట్…

వాయు తుఫాన్ ప్రభావం ఇప్పుడు ముంబై పై పడింది. ఇప్పటికే వాతావరణం అనుకూలించని కారణంగా దాదాపు 400 ఫ్లైట్లను అధికారులు దారి మళ్లించారు. అటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.