‘సైకిల్‌ జ్యోతి’ బతికే ఉంది

లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 1200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి పాశ్వాన్‌పై హత్యాచారం జరిగిందని ఇటీవల ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది.

'సైకిల్‌ జ్యోతి' బతికే ఉంది
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 7:38 AM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాక్సిడెంట్‌కు గురైన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 1200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి పాశ్వాన్(15)‌పై హత్యాచారం జరిగిందని ఇటీవల ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. బీహార్‌లో దర్భంగలో ఓ మాజీ సైనికాధికారి ఆమెను అత్యాచారం చేసి చంపినట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు జ్యోతికి న్యాయం చేయాలంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఫాక్ట్‌చెక్‌లో ఈ వార్త అబద్ధమని తెలిసింది.

చనిపోయిన బాధితురాలి పేరు జ్యోతి కుమారి అని ఫాక్ట్‌చెక్‌లో తేలింది. ఆమె విద్యుత్‌ఘాతంతో మరణించినట్లు రిపోర్టులు వెల్లడించగా.. పోస్ట్‌మార్టంలో ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని తెలిసింది. కాగా దర్భంగలోని మాజీ సైనికాధికారి ఇంట్లో ఇటీవల ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ అధికారితో పాటు ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ వార్త నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సైకిల్‌ జ్యోతిని వాట్సాప్‌లో సంప్రదించగా.. ఆ బాలిక తన రీసెంట్‌ ఫొటోలను వారికి పంపింది. అందులో జ్యోతి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంది.