కేవలం భర్త షాపింగ్‌కి తీసుకెళ్లలేదని.. ఆరు నెలల పసికందును విసిరికొట్టింది ఓ తల్లి. దీంతో.. పాప తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే మరణించింది. తల్లి అనే మాటకు మచ్చ తెచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని అలీగఢ్ ప్రాంతంలోని రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ శర్మ, పింకీ శర్మ భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల పాప సోనీ ఉంది.
హోలీ పండుగ దగ్గర పడుతుండటంతో.. భర్తని షాపింగ్ తీసుకెళ్లమని అడిగితే.. రాహుల్ శర్మ నిరాకరించాడు. తనకు అనారోగ్యం ఉందని, మరోసారి వెళ్దామని చెప్పినా వినకుండా వారించింది. దీంతో కోపాధ్రిక్తురాలైన పింకీ.. తన చేతుల్లో ఉన్న ఆరు నెలల కూతురు సోనీని విసిరికొట్టింది. దీంతో.. పాపకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. కొద్దిసేపటికే సోనీ ప్రాణాలు విడిచింది. దీంతో.. కుటుంబసభ్యులు పింకీపై పోలీసు కేసు పెట్టారు. హత్యానేరం కింద ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు.
Read More: షూటింగ్‌లో గాయపడ్డ హీరో అఖిల్.. తీవ్ర గాయాలు
ఇది కూడా చదవండి: జబర్దస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్.. ‘పిచ్చి కతలు’ పడితే..