ఆలుమగలన్నాక అలకలు, చిన్న చిన్న మనస్పర్థలు సహజం. భార్యాభర్తల (wife and husband) మధ్య ఎన్ని సమస్యలొచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సర్దుకుపోవాలి. అప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. అయితే ఇప్పుడు చాలామంది చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తున్నారు. గోరంత గొడవలను కొండంత చేసుకుంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి నిదర్శనమే హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన సంఘటన. భర్త షాపింగ్‌కు తీసుకెళ్లలేదని మనస్తాపం చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తన ఏడాదిన్నర పాపకు తల్లి ప్రేమ లేకుండా చేసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని బోరబండకు చెందిన శిరీష(23) మెట్టుకానిగూడకు చెందిన ఓ వ్యక్తిని రెండున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. తమ ప్రేమానుబంధానికి గుర్తుగా ఒక పాపను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించారు. అయితే శనివారం (ఫిబ్రవరి5)న తనను షాపింగ్‌కు తీసుకెళ్లాలని భర్తను కోరింది శిరీష. అయితే అతను అందుకు నిరాకరించడంతో ఆమె మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Also Read:Lata Mangeshkar: గాన కోకిల అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న వేళ.. వైరల్ అవుతోన్న వీడియో..
WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే తెలుసుకోవడం ఎలా..?
Lata Mangeshkar: శతాబ్దానికి ఒక్కరు మాత్రమే.. లతాజీ మరణంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతుల సంతాపం..