అక్రమంగా సారా తయారీ.. సీరియల్ నటి అరెస్ట్‌..!

లాక్‌డౌన్‌ వేళ పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఇంకా ప్రారంభం కాని విషయం తెలిసిందే. వాటిలో కేరళ ఒకటి. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, కరోనా కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇంకా మద్యం అమ్మకాలు ప్రారంభం కాలేదు.

అక్రమంగా సారా తయారీ.. సీరియల్ నటి అరెస్ట్‌..!
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 3:37 PM

లాక్‌డౌన్‌ వేళ పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఇంకా ప్రారంభం కాని విషయం తెలిసిందే. వాటిలో కేరళ ఒకటి. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, కరోనా కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇంకా మద్యం అమ్మకాలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో చాలామంది అక్రమంగా మద్యం తయారు చేస్తూ అమ్ముతున్నారు. దీంతో కేరళలోని పలు ప్రాంతాల్లో అక్రమ సారా, మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. వారు దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో నెయ్యటింకర ప్రాంతంలో 400 లీటర్లు, పంగోడ్‌లో 1000లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి కేరళలోని మూడు ప్రాంతాలకు మద్యం, సారాను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీన్ని తయారు చేస్తున్న సీరియల్ నటి సినీ, విశాక్‌ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా చెంబూర్‌కు చెందిన సినీ పలు సీరియల్‌లో నటిస్తోంది. ఇక విశాక్‌ వెల్లరాదకు చెందిన వాడు కాగా.. గతంలో అరుణ్‌ అనే వ్యక్తి మర్డర్ కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read This Story Also: వలస కార్మికులపై ఏపీ సీఎస్ గొప్ప మనసు.. సాహో ‘సాహ్ని’..!