వీడిన రామ్ ప్రసాద్ ‘మర్డర్’ మిస్టరీ

| Edited By:

Jul 15, 2019 | 5:30 PM

సంచలనం రేపిన బెజవాడ పారిశ్రామికవేత్త రామ్ ప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం 11మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు.. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసాద్ హత్యకు భూవివాదమే కారణమని.. పథకం ప్రకారమే అతడిని హత్య చేశారని వివరించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య […]

వీడిన రామ్ ప్రసాద్ ‘మర్డర్’ మిస్టరీ
Follow us on

సంచలనం రేపిన బెజవాడ పారిశ్రామికవేత్త రామ్ ప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ఈ కేసులో మొత్తం 11మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు.. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసాద్ హత్యకు భూవివాదమే కారణమని.. పథకం ప్రకారమే అతడిని హత్య చేశారని వివరించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ.. రాం ప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్ల నుంచి వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో కోగంటి సత్యం.. రామ్ ప్రసాద్‌కు రూ.70కోట్లు బాకీ పడగా.. రూ.23కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక రామ్ ప్రసాద్‌ను చంపేందుకు పథకం పన్నిన సత్యం.. అందుకు నెలరోజులు ముందుగా రెక్కీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రామ్ ప్రసాద్ గుడి నుంచి వస్తుండగా.. నలుగురు అటాక్ చేసి మర్డర్ చేశారని జాయింట్ సీపీ వెల్లడించారు.