జలదీక్ష చేపట్టాలని ప్రయత్నించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే నేడు జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పీఎస్‌కు తరలించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి నిర్మలను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
సింగూరు జలాయశం ఎండిపోవడం కారణంగా సంగారెడ్డికి నీటి కొరత ఏర్పడిందని కొంతకాలంగా ఆరోపిస్తున్న జగ్గారెడ్డి…దీనికి మాజీమంత్రి హరీశ్ రావు కారణమని ఆరోపణలు గుప్పించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.