తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం తల్లి తాహెరాబేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం చేసిన ఎన్నో అక్రమాలు, భూకబ్జాల్లో ఈమె కూడా కీలక పాత్ర పోషించిన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పట్టణ సీఐ సురేందర్ తెలిపారు. భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలతోపాటు పలు నేరాలకు తాహెరాబేగం పాల్పడ్డారని ఆమెపై ఇప్పటికే 12 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సురేందర్ చెప్పారు.