దారుణం.. రేప్ కేసు వెనక్కి తీసుకోలేదని.. బట్టల్ని చించేస్తూ.. బెల్ట్‌తో..!

| Edited By:

Mar 08, 2020 | 7:06 AM

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రేప్ కేసు వెనక్కి తీసుకులేదంటూ.. కొందరు దుండగులు.. భార్యాభర్తలపై దాడికి దిగారు. ఆటోలో వెళ్తుండగా.. అడ్డుకుని వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు ఎనిమిది మంది కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. గత నెల 24వ తేదీన ఈ దారుణ ఘటన ఔరంగాబాద్‌లో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు […]

దారుణం.. రేప్ కేసు వెనక్కి తీసుకోలేదని.. బట్టల్ని చించేస్తూ.. బెల్ట్‌తో..!
Follow us on

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రేప్ కేసు వెనక్కి తీసుకులేదంటూ.. కొందరు దుండగులు.. భార్యాభర్తలపై దాడికి దిగారు. ఆటోలో వెళ్తుండగా.. అడ్డుకుని వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు ఎనిమిది మంది కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. గత నెల 24వ తేదీన ఈ దారుణ ఘటన ఔరంగాబాద్‌లో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియోలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

దాడిలో మహిళ సోదరుడితో పాటు.. బావలు కూడా…

అయితే 2016లో సదరు బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో కొందరు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  అప్పట్లో వారిపై బాధితురాలు కేస్ పెట్టింది. అయితే అప్పటి కేసును ఉపసంహరించుకోవాలని.. గత నెల 24వ తేదీ రాత్రి సమయంలో.. సదరు బాధితురాలు భర్తతో ఆటోలో వెళ్తుండగా.. అడ్డుకుని.. ఓ రూంలోకి లాక్కెళ్లారు. అనంతరం వారి దుస్తులను చించేస్తూ.. బెల్ట్‌లో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ఇద్దరిపై పెట్రోల్ పోసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఈ దాడికి పాల్పడ్డ వారిలో బాధిత మహిళ సోదరుడితో పాటు.. ఇద్దరు బావలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ గ్యాంగ్‌లో కొందరు పోలీసులమని చెప్పి.. ఆటోను అడ్డుకున్నారని తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు వీడియో ఆధారంగా మంగళవారం వారు బాధితులను కలిసి.. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు ఎస్పీ సాగర్ పాటిల్ తెలిపారు.