కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?

|

Feb 18, 2021 | 12:26 PM

కుంటా శ్రీను. లాయర్ వామన్ రావు చనిపోతూ చెప్పిన పేరిది., పుట్టా మధు. కుంటా శ్రీనుతో పాటే ఇప్పుడు సమాంతరంగా వినిపిస్తున్న పేరు. ఇంతకీ పెద్దపల్లి జిల్లా..

కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?
Follow us on

కుంట శ్రీను. లాయర్ వామన్ రావు చనిపోతూ చెప్పిన పేరిది., పుట్టా మధు. కుంట శ్రీనుతో పాటే ఇప్పుడు సమాంతరంగా వినిపిస్తున్న పేరు. ఇంతకీ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో జరిగిన లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి జంట హత్యలకు, పుట్టా మధుకు లింకేటన్నది ఇప్పుడు పోలీసులు శోధిస్తున్న అంశం. పుట్టా మధు ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో మంథనికి ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. పుట్టా మధుకి కుంట శ్రీను ప్రధాన అనుచరుడు. కుంట ఏం చేసినా, పుట్టా కళ్లలో ఆనందం కోసమే అని ప్రచారం ఉంది జిల్లాలో. అంతెందుకు నిన్న జంట హత్యలు చేసే వరకూ కూడా కుంట శ్రీను.. పుట్టా మధుతోనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి మంథనిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. చౌరాస్తాలో గుంపులుగా చేరి కేక్‌ కట్ చేశారు.

ఈ వేడుకలు జరుగుతుండగానే వామన్‌రావు, అతని భార్య నాగమణి హైదరాబాద్ నుంచి మంథని వచ్చారు. ఉదయం 11.30కి అక్కడకి చేరుకున్న వాళ్లు 12.30 వరకూ అక్కడే ఉన్నారు. ఓ కేసుకు సంబంధించి క్లయింట్స్‌ని కలిసిన తర్వాత తిరిగి మళ్లీ హైదరాబాద్ బయల్దేరారు. కానీ 12.30వరకూ పుట్టాతోనే ఉన్న శ్రీనుకు వాళ్లు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరిన విషయం తెలిసింది. సరిగ్గా 40 నిమిషాల తర్వాత.. రామగిరి మండలం కల్వచర్లకు చేరుకోగానే కుంట శ్రీను, వామన్‌రావు కారును అడ్డగించాడు. అడ్డగోలుగా నరికేశాడు. అయితే అప్పటి వరకూ పుట్టా మధుతో ఉన్న కుంటకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఈ కేసుకు పుట్టా మధుకు లింకుందా? ఇవే తేలాల్సిన విషయాలు.

అడ్వకేట్ వామనరావు హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న కుంట శ్రీనివాస్… ఇంతకీ ఎవరు…. హత్యలు చేసే స్థాయికి వెళ్లిన కుంట శ్రీను వెనకాల ఉన్నదెవరు… ఆయన నేర చరిత్ర ఏం చెబుతోంది. ఆయనకు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు అంతగా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. tv9 సేకరించిన సమాచారం ప్రకారం కుంట శ్రీను నేపథ్యం ఒకసారి చూద్దాం.

> అడ్వకేట్ దంపతుల హత్యకేసులో కుంట శ్రీను కేసులో A2 నిందితుడుగా ఉన్నాడు
> వామన్‌రావును నిట్టనిలువునా నరికింది కుంట శ్రీనే.!
> గతంలో సికాస- మావోయిస్టు అనుబంధ సంఘంలో పనిచేసిన శ్రీను
> కుంట శ్రీనుపై గతంలో అనేక కేసులు
> గోదావరిఖని పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనుపై వరకట్న వేధింపుల కేసు
> మంథనిలో కుంట శ్రీనుపై భూకబ్జా కేసులు
> గుంజపడుగులో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన శ్రీను, దీనికి కారణం వామన్ రావు అని చెబుతూ వచ్చాడు
> గుంజపడుగు ఆలయ కమిటీ మెంబర్‌గా వామన్ రావు సోదరుడు. వామనరావు తమ్ముడ్ని తప్పించి తన మనిషిని పెట్టుకున్న కుంట శ్రీను
> ప్రస్తుతం TRS మండల ప్రెసిడెంట్‌గా ఉన్న కుంట శ్రీను.

Read also : కుప్పం నుంచి కూడా చంద్రబాబుని పీకిపడేసి తరిమికొట్టారు, ఇకనైనా ఆయన జగన్‌కు మద్దతివ్వాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా